Siddaramaiah: రేపే సిద్దరామయ్య కేబినెట్ ప్రమాణ స్వీకారం

Siddaramaiah

Siddaramaiah: రేపే సిద్దరామయ్య కేబినెట్ ప్రమాణ స్వీకారం

Siddaramaiah: ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లను కైవసం చేసుకోగా బీజేపీ 66 సీట్లకు పరిమితమై అధికారాన్ని కోల్పోయింది.

ఇక జేడీఎస్ కేవలం 19 స్థానాలే దక్కించుకుంది. సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ పోటీలో చివరికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.

రేపు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డికే శివకుమార్‌లు రేపు మద్యాహ్నం 12.30 గంటలకు అత్యంత ఘనంగా ప్రమాణ స్వీకారం జరగనుంది.

అలాగే సిద్దరామయ్య కేబినెట్‌లో మొత్తం 29 మంది సభ్యులకు చోటు దక్కింది. వీరంతా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో ఆ రాష్ట్ర గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ ప్రమాణం చేయించనున్నారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హేమంత్ సోరెన్, సీతారాం ఏచూరి, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి అగ్రనేతలను కాంగ్రెస్ ఆహ్వానించింది. . కానీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మాత్రం ఆహ్వానించలేదు.

Also Watch

Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్…

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకు ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న కేసీఆర్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది.

రేపు జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా గాంధీ కుటుంబం హాజరుకానుంది.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ హాజరుకానున్నారు.

అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెండ్రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఈ మధ్యాహ్నం బెంగళూరు బయలుదేరి వెళ్తారు.

ఈరోజు సాయంత్రం 7 గంటలకు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) సమావేశం జరగనుంది.

కాంగ్రెస్ విజయం తరువాత ముఖ్యమంత్రి ఎవరనే చర్చ రోజుల తరబడి సాగిన సంగతి తెలిసిందే.

చివరికి  కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి అని గురువారం ప్రకటించారు.

కెపిసిసి చీఫ్‌గా శివకుమార్‌ కొనసాగుతారని.. ఢీల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థ) కెసి వేణుగోపాల్ ఈ విషయాన్ని ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికల వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌గా శివకుమార్‌ కొనసాగుతారని చెప్పారు. ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు.

పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ కొనసాగుతారని, మే 20న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల బృందం ప్రమాణస్వీకారం చేస్తుందని వేణుగోపాల్ తెలిపారు.

One thought on “Siddaramaiah: రేపే సిద్దరామయ్య కేబినెట్ ప్రమాణ స్వీకారం

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh