Viveka Murder Case: హత్య కేసులో ట్విస్ట్ ఇచ్చిన సీబీఐ

Viveka Murder Case

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్ ఇచ్చిన సీబీఐ అవినాష్ అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్

Viveka Murder Case: ఏపీలో నాలుగేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి  Viveka Murder Case సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. తాజాగా సుప్రీంకోర్టు జోక్యంతో మారిన సీబీఐ టీమ్ ఈ కేసులో చడీచప్పుడు లేకుండా దర్యాప్తు సాగిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ పులివెందుల వెళ్లిన సీబీఐ టీమ్.. అక్కడ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడిని అదుపులోకి తీసుకుని కడప జైలు గెస్ట్ హౌస్ కు తరలించింది.
Viveka Murder Case లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని గతంలో పలుమార్లు సీబీఐ ప్రశ్నించింది. కానీ అరెస్టు చేయలేదు తాజాగా ఈ గజ్జల ఉదయ్‌కుమార్‌ రెడ్డి, అతడి తండ్రి జయప్రకాష్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది.పులివెందులలో ఉదయం ఆయన్ను అదుపులోకి తీసుకుని కడప జైల్ గెస్ట్‌హౌస్‌‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు.

అనంతరం ఉదయ్‌ను అరెస్ట్‌ చేసినట్లు సీబీఐ అధికారులు ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు అధికారులు. అనంతరం అతడిని హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో హాజరుపరిచేందుకు కడప నుంచి తరలిస్తున్నారు.

గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా ఎంపీ తండ్రి భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉదయ్‌ ఉన్నట్లు సీబీఐ గుర్తించిందట. అందుకే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ఉదయ్ ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడు అంటూ ప్రచారం జరుగుతోంది.

ఉదయ్‌కుమార్‌ రెడ్డి గతంలో సీబీఐ ఎస్పీ రామ్‌ సింగ్‌పై గకడప కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. ఉదయ్‌కుమార్‌ రెడ్డితో రామ్‌ సింగ్‌పై రిమ్స్‌ పోలీసులు గతేడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు Viveka Murder Case లో సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.తనను సీబీఐ అధికారులు విచారణ పేరుతో వేధిస్తున్నారని కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాను అన్నారు. సీబీఐ అధికారులు తాము చెప్పినట్లు వినాలని బెదిరిస్తున్నారని అసలు హత్య జరిగిన రోజు తాను ఎక్కడికి వెళ్లలేదని ఇదే విషయాన్ని సీబీఐ అధికారులకు చెప్పినా వినడం లేదన్నారు.

ఉదయ్​ అరెస్టు మెమోనూ అతని కుటుంబ సభ్యులకు సీబీఐ అప్పగించింది. తర్వాత కడప నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు ఉదయ్‌ కుమార్ రెడ్డిని తరలించారు. హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో ఉదయ్‌ను హాజరుపరిచే అవకాశం ఉంది. తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంలో ఉదయ్‌కుమార్‌ రెడ్డి పని చేస్తున్నారు.

అయితే Viveka Murder Case లో ఇప్పటికే దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నా కోర్టుకు మాత్రం తగిన వివరాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైంది. దీంతో కేసు దర్యాప్తు ఇంకెన్నాళ్లు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. టీమ్ లో మార్పులు చేసింది. అంతేకాదు వివేకా కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు ఈ నెలాఖరు వరకూ గడువు విధించింది. దీంతో నిర్ణీత గడువులోగా సీబీఐ దర్యాప్తు పూర్తి చేస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh