Ustaad Bhagat Singh: వివాదంలో ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్
Ustaad Bhagat Singh: పూనమ్ కౌర్ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడూ వివాదాలతో ట్రావెల్ చేస్తూ వార్తల్లో నిలిచే ఈ హీరోయిన్ అప్పట్లో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు మరోసారి పూనమ్ కౌర్ పవన్ నటిస్తున్న చిత్రాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
16 ఏళ్ళ వయసులోనే హీరోయిన్ అవుదామని ఇండీస్ట్రీకి వచ్చిన పూనమ్ కౌర్.. ఆశించిన మేర అవకాశాలు అందుకోలేక పోయింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తాను మోసపోయానంటూ వివాదాలతో సావాసం చేస్తున్న ఈ బ్యూటీ.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయమై పెడుతున్న పోస్టులు పలు చర్చలకు తావిస్తుంటాయి. తాజాగా అదే రిపీట్ అయింది. అయితే తనకు కొందరి వల్ల అన్యాయం జరిగిందని పరోక్షంగా చెబుతూ వస్తున్న పూనమ్.. అసలు విషయాన్ని మాత్రం ఇప్పటికీ చెప్పలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన్ను పొగుడుతుందా, తిడుతుందా అర్థం కాకుండా తికమక పెడుతుంటుంది పూనమ్.
Also Watch
అయితే ‘గబ్బర్ సింగ్’ వంటి భారీ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో వస్తున్న సినిమానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’.నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ లో భగత్ సింగ్ పేరును హీరో కాళ్ల దగ్గర ఉంచారు. ఇదే విషయాన్ని తప్పు పట్టిన పూనమ్ కౌర్ మూవీ టీమ్ పై కామెంట్స్ చేసింది. “భగత్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తి పేరును టైటిల్ పోస్టర్ లో ఆయన పేరుని నీ కాలి బూతు వద్ద పెట్టుకుంటావా?.. ఇది అహంకారమా? లేక నిర్లక్ష్యమా? అంటూ పూనమ్ కౌర్ కామెంట్స్ చేయడం తీవ్ర దుమారానికి దారి తీసింది.
అయితే ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారుతున్నాయి. ఇక పూనమ్ చేసిన ఈ కామెంట్స్ కు పవన్ ఫ్యాన్స్ తమ స్టైల్లో రిప్లై ఇస్తున్నారు. అటెన్షన్ సీకర్ వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇష్యూతో తమ అభిమాన హీరో మూవీ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది అనే సంతోషం లేకుండా పోయింది పవన్ ఫ్యాన్స్ కు.
https://twitter.com/MythriOfficial/status/1656272624497090560?s=20
https://twitter.com/poonamkaurlal/status/1656520636439863296?s=20