TS Inter result 2023: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

TS Inter result 2023

TS Inter result 2023: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

TS Inter result 2023: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు  రేపు  మంగళవారం (మే 9వ తేదీ) విడుదల కానున్నాయి. నాంప‌ల్లిలోని ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యంలో ఫలితాల విడుదల కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఫలితాల వెల్లడిపై బోర్డు అధికారులు ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నందున ఆమె వెసులుబాటును పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు. ఫలితాల వెల్లడికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు. విద్యార్థులు మంగళవారం ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్లు tsbie.cgg.gov.inవెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేయబోతున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు  మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వ తేదీ వరకు  అలాగే  ఇంటర్ రెండ  సంవత్సరం పరీక్షలు  మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు  జరిగాయి.

Also Watch This

Ap Tidco Houses: టిడ్కో ఇళ్ల కాలనీలను ప్రారంభించనున్న

దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పలు దఫాలుగా ట్రయల్‌రన్‌ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో జీరో సాంకేతిక సమస్యలు నిర్ధారౖణెందని.. దీంతో ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం  తెలంగాణ ఇంటర్ మొదటి రెండో సంవత్సరం ఫలితాలు  2023 వెలువరించనున్నారు.స్పాట్‌ వాల్యూయేషన్‌ ప్రక్రియ 20 రోజుల క్రితమే పూర్తయింది. పరీక్షలు ముగిసి సుమారు 40 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ఫలితాలు ప్రకటించకపోవడంపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమైంది.

అసలు  పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోనే ఫలితాల ప్రకటనకు అవకాశం ఉంటుంది. కానీ ఈ ఏడాది ఫలితాలు విడదల చేయడం ఆలస్యమైంది. జాప్యం జరిగే కొద్దీ దాని ప్రభావం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలపై పడనుంది. కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. ఇందులో ఉత్తీర్ణులైతే విద్యా సంవత్సరం వృధా కాకుండా పై చదువులకు వెళ్లవచ్చు. ఈ నెలలో ఎంసెట్‌తో పాటు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటి ఫలితాలను మే చివర్లో లేదా జూన్‌ మొదట్లో ప్రకటించనున్నారు. అనంతరం ఇంజనీరింగ్‌, ఇతర కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను త్వరగా వెల్లడిస్తేనే విద్యార్థులు ఇంజనీరింగ్‌, ఇతర కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం కూడా మళ్లీ పరీక్షలు రాస్తారు. దీంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Leave a Reply