Rahul Gandhi: బస్సు ప్రయాణం లో కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి

Rahul Gandhi

Rahul Gandhi: బస్సు ప్రయాణం, చేసిన రాహుల్ గాంధీ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి

Rahul Gandhi: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపధ్యం లో  వీలైనంతగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి.కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ , మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్  ఇద్దరిలో ఎవరికీ సరిపడా సీట్లు రాకుంటే కింగ్‌పిన్‌గా మారొచ్చని జేడీఎస్‌ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఇప్పటికే తమ అభ్యర్థుల తరఫున ప్రధాని మోదీ, అమిత్‌ షా, మల్లికర్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీ, కుమార స్వామి, దేవేగౌడ వంటి అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఉచిత హామీలతో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించారు.

ప్రచార నేపధ్యం లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ  నిన్న స్కూటీపై డెలివరీ బాయ్ తోపాటు వెళ్లి ప్రచారం నిర్వహించిన రాహుల్ ఈ  రోజు  సోమవారం సిటీ బస్సులో ప్రయాణం చేశారు. రాహుల్ గాంధీ తొలుత కన్నింగ్ హామ్ రోడ్డులో ఉన్న‘కేఫ్ కాఫీ డే’లో కాఫీ తాగారు. తర్వాత బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్ స్టాప్ కు వెళ్లారు. కాలేజీ స్టూడెంట్లు, మహిళా ఉద్యోగులతో మాట్లాడారు. తర్వాత బస్సులో ప్రయాణించారు. మహిళలు, కాలేజీ విద్యార్థులతో రాహుల్ మాట్లాడారు.

Also Watch

TS Inter result 2023: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

నిత్యావసరాల ధరల పెరుగుదల, గృహలక్ష్మి (మహిళలకు నెలకు రూ.2 వేలు ఇచ్చే పథకం), బీఎంటీసీ, కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీ తదితర అంశాలపై వారితో చర్చించారు. తర్వాత లింగరాజపురం వద్ద రాహుల్ బస్సు దిగారు. అక్కడ స్టాప్ లో ఉన్న వారితోనూ రాహుల్ మాట్లాడారు.  ఈ సంధర్బం గా ఆయనతో ఫోటోలు దిగేందుకు, ముచ్చటించేందుకు కాలేజీ విద్యార్థులు, మహిళలు పోటీపడ్డారు.

20 రోజులుగా సాగుతున్న ఎన్నికల ప్రచార హోరు సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. మైక్‌సెట్లు, లౌడ్‌స్పీకర్లు ఇక మూగవోనున్నాయి. ర్యాలీలు, రోడ్‌ షోలకు తెరపడనుంచి. బుధవారం కన్నడ ఓట్లరు ఆయా పార్టీల అభ్యర్థుల తలరాతను నిర్ధేశించనున్నారు. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వస్తాయి. ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారనే విషయమై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.

Leave a Reply