Thudi: శ్వాస విడిచిన మహాత్మగాంధీ మనవడు అరుణ్ గాంధీ

Thudi

Thudi: శ్వాస విడిచిన మహాత్మగాంధీ మనవడు అరుణ్ గాంధీ

Thudi మహాత్మా గాంధీ మనవడు, సుశీల, మణిలాల్ గాంధీల కుమారుడు అరుణ్ గాంధీ మంగళవారం ఉదయం  కన్నుమూసినట్లు ఆయన కుమారుడు తెలిపారు. ఆయనకు 89 ఏళ్లు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరకు కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు కుమారుడు తుషార్, కుమార్తె అర్చన, నలుగురు మనవళ్లు, ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు.

అయితే ఫిబ్రవరి 28న కోల్హాపూర్ కు వచ్చిన ఆయన అవనీ సంస్థాన్ లో బస చేశారు. ఈ స్వచ్ఛంద సంస్థను అనురాధా భోస్లే నడిపిస్తున్నారు. గడిచిన 24 ఏళ్లుగా అరుణ్ మణిలాల్ ఇక్కడి అవని సంస్థాన్ ను సందర్శించడం అలవాటు. పది రోజుల పర్యటనకు వచ్చిన ఆయన అనారోగ్యం Thudi కారణంగా కోల్హాపూర్ లోనే ఉండిపోయినట్ట భోస్లే తెలిపారు.

అయితే సాధారణ ఫ్లూ లక్షణాలు ఉండడంతో ఏస్టర్ ఆధార్ హాస్పిటల్ లో చేర్పించినట్టు భోస్లే వెల్లడించారు. నయం కావడంతో వైద్యులు డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. దాంతో తిరిగి అవనీ సంస్థాన్ కు వచ్చేశారని, ఈ సమయంలో ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించినట్టు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నామని, అన్నింటికంటే రాష్ట్రం, దేశాన్ని ఎక్కువగా ప్రేమించాలని బాలికలకు మణిలాల్ సూచించినట్టు భోస్లే వివరించారు. రాత్రి వరకు రాసుకుంటూ, ఆ తర్వాత నిద్రించిన మణిలాల్, ఉదయం చూసే వరకు మరణించి ఉన్నారని ప్రకటించారు.గత రెండున్నర దశాబ్దాలుగా మణిలాల్ తో భాగస్వామ్యం ఉందంటూ, కోల్హాపూర్ కు వచ్చిన ప్రతి సందర్భంలోనూ అవనీ సంస్థాన్ లోనే బస చేసేవారని భోస్లే తెలిపారు. మహాత్మాగాంధీ గుర్తులుగా సేకరించిన ఫొటోలతో ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారని.. ఆయన లేనందున, Thudiఇప్పుడు ఆయన కోరిక మేరకు తాము ఆ పని చేస్తామని ప్రకటించారు. వాషి నంద్వాల్ లో గాంధీ మిషన్ కు చెందిన స్థలంలో మ్యూజియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

అరుణ్ గాంధీ మృతి వార్తను ఆయన కొడుకైన తుషార్ గాంధీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. “ఈ రోజు  ఉదయం మా నాన్న చనిపోయారు. ఆయన లేని లోటును తట్టుకోలేకపోతున్నాం” అని తుషార్ ట్వీట్ చేశారు. దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్ లో 1934 ఏప్రిల్‌ 14న మణిలాల్ గాంధీ, సుశీలా మష్రూవాలా దంపతులకు అరుణ్‌ గాంధీ జ‌న్మించారు. రచయిత, సామాజిక-రాజకీయ కార్యకర్తగా ఆయన అందరికి సుపరిచితం. అరుణ్‌ గాంధీ బెథానీ హెగెడస్‌తో కలిసి ‘ కస్తూర్బా , ది ఫర్‌గాటెన్ ఉమెన్’, ‘గ్రాండ్‌ ఫాదర్‌ గాంధీ’ వంటి పుస్తకాలను రాశాడు.  తన తాత అడుగుజాడలను అనుసరించి, అతను ఎల్లప్పుడూ శాంతి,  సామరస్య స్థాపన కోసం గాంధేయ విలువలను ప్రచారం చేశాడు.1982లో తన తాత జీవితం ఆధారంగా తీసిన చిత్రానికి 25 మిలియన్ డాలర్లు సబ్సిడీ ఇచ్చిన తర్వాత భారత ప్రభుత్వాన్ని ఒక వ్యాసంలో విమర్శించారు.  అరుణ్ గాంధీ అంత్యక్రియలు ఈ సాయంత్రం కొల్హాపూర్‌ జిల్లాలోని వాషి నంద్వాల్‌లో జరగనున్నాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh