Telangana: మందు బాబులకు గుడ్ న్యూస్

Telangana

Telangana: మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Telangana: తెలంగాణ ప్రభుత్వం మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం పై  రాస్ట్రం ప్రభుత్వం  విధించే ఎక్సేంజ్ సుంకన్ని తగ్గిస్తూ  నిర్ణయాన్ని తీసుకుంది.  అయితే  సవరించిన ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్), రేట్లు శుక్రవారం నుండి బాట్లింగ్ యూనిట్ల నుండి పంపబడిన స్టాక్‌లకు వర్తిస్తాయి. అలాగే సవరించిన ధరల ప్రకారం 90 ఎంఎల్‌, 180 ఎంఎల్‌ మద్యం బాటిల్‌పై రూ.10, 375 ఎంఎల్‌ బాటిల్‌పై రూ.20, 750 ఎంఎల్‌ బాటిల్‌పై రూ.40 తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలో అధిక ధరల కారణంగా బయట రాష్ట్రాల నుండి మద్యం వస్తుందని భావించిన ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ధరల తగ్గింపు ప్రతిపాదన పంపింది.

అక్రమ మద్యం రవాణా, అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్న నేపథ్యంలో మద్యం ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అన్ని బ్రాండ్ల మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బీర్ల ధరలు మాత్రం యథాతధంగా ఉంచాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మందు బాబులు ఫిదా అవుతున్నారు.

కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  మద్యం ధరలను  20 శాతం పెంచింది.  ధరల పెంపు కారణంగా  మద్యం విక్రయాలు తగ్గినట్టుగా  అప్పట్లో ఎక్సైజ్ శాఖ గుర్తించింది. మద్యం ధరల పెంపుదల కారణంగా  నకిలీ బ్రాండ్లు  మార్కెట్లోకి  విస్తృతంగా  వచ్చే అవకాశం ఉందని  ఎక్సైజ్ శాఖాధికారులు అనుమానించారు. దీంతో  మద్యం ధరలను తగ్గించింది  ప్రభుత్వం. మద్యంపై ఉన్న  ఎక్సైజ్ సుంకాన్ని  తగ్గించింది.  దీంతో మద్యం ధరలు తగ్గనున్నాయి

అయితే  రిజిస్టర్డ్ మద్యం దుకాణాలు సవరించిన ధరల ప్రకారం శుక్రవారం నుంచి స్టాక్‌ను పంపించాలని ఆదేశించారు. “లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్ 2011 ప్రకారం అవసరమైన విధంగా సవరించిన యం ఆర్ పీ  (అన్ని పన్నులతో సహా)తో కూడిన స్టిక్కర్‌ను అతికించిన తర్వాత ఫినిష్డ్ గూడ్స్ స్టోర్స్ (FGS) వద్ద ఉన్న స్టాక్‌లు డిపోలకు పంపబడతాయి, స్టిక్కర్ యం ఆర్ పీని కవర్ చేయదు. లేబుల్‌పై తయారీదారు చేసిన ప్రకటన,” ఆర్డర్ సియాడ్. బీర్లు, రెడీ టు డ్రింక్స్‌ ధరల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు. తగ్గించిన మద్యం ధరల వివరాలను తెలంగాణ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ గజ్జెల నగేశ్‌ వెల్లడించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh