Talasani Srinivas Yadav :డబుల్ బెడ్ రూం ఇండ్లను

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav :డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన తలసాని శ్రీనివాస్ యాదవ్

 

హైదరాబాద్‌ గోషామహల్‌ నియోజకవర్గంలోని మురళీధర్‌బాగ్‌లో రూ.10 కోట్లతో నిర్మించిన 120 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంత్రి మహమూద్‌ అలీతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రూ.2 వేల పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఆడబిడ్డ పెండ్లికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. పేదల కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని చెప్పారు.Talasani Srinivas Yadav 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల కోసం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిందని అన్నారు. 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.  అయితే సకల సౌకర్యాలతో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.

Talasani Srinivas Yadav గతంలో ఏ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇవ్వలేదని మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. దేశంలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమేనని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీరు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని వెల్లడించారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టామన్నారు. పాతబస్తీని సీఎం కేసీఆర్‌ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో గంగా జమున తెహజీబ్‌ సంస్కృతిని కాపాడుతున్నామని చెప్పారు.

పేదలు ఆత్మ గౌరవంతో బతకడానికే సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలలో బస్తీ దవాఖానా లు, అంగన్ వాడి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శర్మన్ తో కలిసి హౌసింగ్, రెవెన్యూ, జి హెచ్ ఎంసీ(GHMC) అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Talasani Srinivas Yadav ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి సౌకర్యాలు లేక, ఇరుకు ఇండ్లలో పడుతున్న ఇబ్బందులను చూసి చలించిన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఆలోచనల నుండి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కార్యక్రమం కార్యరూపం దాల్చిందని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చులతో రోడ్లు, డ్రైనేజి, త్రాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను హైదరాబాద్ జిల్లా పరిధిలోని 22 ప్రాంతాలలో నిర్మించి అర్హులైన పేదలకు ఉచితంగా అందజేసినట్లు చెప్పారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh