RRR Movie: విదేశాల్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్

RRR Movie: విదేశాల్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్

RRR దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాకు ప్రపంచమే ఫిదా అయ్యింది. జక్కన్న స్క్రీన్ ప్లేకు హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు కురిపించారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ 2023కు నామినేట్ అవుతుందని భావించారు. కానీ చివరి నిమిషంలో గుజరాతీ ఫిల్మ్ ఛలో షో ఎంపికైంది. ఇక ఇప్పుడు విదేశాల్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఎలా ఉందనేది తెలియజేస్తూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలలో విద్యార్థులు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ హిందీ వెర్షన్ ఆలపించారు. విద్యార్థులు అందంగా నాటు నాటు సాంగ్ పాడుతున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. ఇది రాజమౌళి గొప్ప విజయం అని.. ఏ దర్శకుడికి దొరకని అభిమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవసరం లేదని.. ఇది అంతకంటే ఎక్కువ విజయం అంటూ కామెంట్స్ చేశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh