Raghavendra Rao: అశ్వనీ దత్, అల్లు అరవింద్ లపై షాకింగ్

Raghavendra Rao

Raghavendra Rao: అశ్వనీ దత్, అల్లు అరవింద్ లపై షాకింగ్ కామెంట్స్ చేసిన రాఘవేంద్ర రావు

Raghavendra Rao: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలో ఒకటిగా నిలిచింది వైజయంతీ మూవీస్. 1972లో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థకు అధిపతి అశ్వనీ దత్ చలసాని అని తెలిసిన విషయమే. ఈ బ్యానర్ నుంచి అనేక సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించాయి. మరో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వీరి ఇద్దరితో కలిసి ఎన్నో హిట్స్ అందించారు. అయితే తాజాగా ఈ అగ్ర నిర్మాతలపై కీలక వ్యాఖ్యలు చేశారు రాఘవేంద్ర రావు .

లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ మాళవిక నాయర్  జంటగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే  స్వప్న సినిమాస్ బ్యానర్‌పై అశ్వినీదత్ కూతుళ్లు స్వప్న దత్ ప్రియాంక దత్ నిర్మించారు. ఈ మూవీ మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకోగా ప్రస్తుతం ‘చేయి చేయి కలిపేద్దాం’ అంటూ సాగే సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. నిర్మాతలు అశ్వినీ దత్, అల్లు అరవింద్, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు స్నేహానికి 30 ఏళ్లు నిండిన సందర్భంగా ‘అన్నీ మంచి శకునములే’ మూవీ టీమ్ బంతి భోజనం పేరుతో డిఫరెంట్ గా ప్రమోషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లుడు నాగ్ అశ్విన్ విషయంలో అశ్వినీ దత్‌‌ను ఉద్దేశించి దర్శకేంద్రుడు సర్‌ప్రైజింగ్ కామెంట్స్ చేశారు.

Also Watch

Diesel Vehicles: కేంద్రం ప్రభుత్వం వద్దకు కీలక నివేదిక

అసలు “సీతా రామం సినిమాలో సీత పాత్ర ఏమైంది. ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయడం బాధగా ఉంది. నేను ఒక ఐడియా చెబుతాను. మీ డైరెక్టర్ కు చెప్పు. ఆమెను బాధపడనిచ్చి తెలియకుండా రివాల్వర్ తీసుకెళ్లి విలన్ దగ్గరకెళ్లి కాల్చబోతే, వాడు గుహలోంచి ఎక్కడికెక్కడో తీసుకెళ్లిపోయి రామ్ చావలేదని చెప్తాడు. అప్పుడు వాళ్లిద్దరు తప్పించుకుంటే ఫ్యామిలీ విలన్స్ ఎలా ఛేజ్ చేస్తారనే కోణంలో స్టోరీ చేయండి” అని రాఘవేంద్ర రావు హింట్ ఇచ్చారు. మీ ఆయనతో తీయండి: రాఘవేంద్ర రావు చెప్పిన సీతా రామం సీక్వెల్ స్టోరీకి స్వప్న స్పందించారు. “మీరు జగదేక వీరుడు సీక్వెల్ గురించి ఆలోచించండి” అని స్వప్న చెప్పుకొచ్చారు. దీంతో ప్రియాంకను పిలిచిన రాఘవేంద్ర రావు.. మీ ఆయన నాగ్ అశ్విన్‌తో ఆ సినిమా తీయించమని సూచించాడు. పనిలో పనిగా ఓ సీక్రెట్ చెప్తానంటూ. అశ్వినీ దత్‌కు, అరవింద్‌కు ఇకపై తన లాంటి డైరెక్టర్ల అవసరం లేదన్నాడు. ఎందుకంటే దత్అ ల్లున్ని ఇంట్లో కట్టేసి పెట్టుకున్నాడు. అరవింద్ ఏమో హీరోను ఇంట్లో కట్టేసి పెట్టుకున్నాడు. వీళ్లిద్దరికీ నాతో పని తీరిపోయింది. అయినా మేము ఇప్పటికీ స్నేహితులమే’ అంటూ ముగించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh