మెగాస్టార్‌ పాటకు స్టెప్పులేసిన స్టార్‌ బ్యాడ్మింటన్‌

pv sindhu dances to chiranjeevis waltair virayya

మెగాస్టార్‌ పాటకు  స్టెప్పులేసిన స్టార్‌ బ్యాడ్మింటన్‌

స్టార్‌ బ్యాడ్మింటన్‌ పీవీ సింధు ఆటలోనే కాదు డ్యాన్స్‌లోనూ మెరుపులు మెరిపిస్తోంది. ఓవైపు బ్యాడ్మింటన్‌ కోర్టులో సంచలనాలు నమోదు చేస్తోన్న ఈ స్టార్‌ ప్లేయర్‌ మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్ గా ఉంటోంది.తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు కెరీర్‌ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే బ్యూటిఫుల్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ పాటలకు డ్యాన్సులు చేస్తూ ఆ వీడియోలను పంచుకుంటుంది. తాజాగా మరోసారి తన డ్యాన్సింగ్‌ ట్యాలెంట్‌ను చూపించింది సింధు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య లోని ‘బాసు వేర్ ఈజ్ ద పార్టీ’ హుషారుగా స్టెప్పులేసింది. ఈ సందర్భంగా బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ లెహంగాలో ఎంతో స్టైలిష్‌గా కనిపించింది సింధు. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే పీవీ సింధు షేర్‌ తన డ్యాన్సింగ్‌ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోపే 2.5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అలాగే వేలాది కామెంట్లు వచ్చాయి.  సింధూ మీ డ్యాన్సింగ్‌ ట్యాలెంట్‌ అదుర్స్‌ నిన్ను త్వరలోనే టాలీవుడ్‌లో చూడాలనుకుంటున్నాం  అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవల సింధు డ్యాన్స్‌లు, ఫొటోషూట్‌లు చూస్తుంటే ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే వీటిని కొట్టిపారేసిందీ బ్యాడ్మింటన్‌ స్టార్‌. తన ధ్యాసంతా ఆటపైనే ఉందంటూ స్పష్టం చేసింది.

Sindhu Pv on Instagram: “We’re is the party ?? Bossu 😛😉 . . . . @paulmiandharsh @bornaliicaldeira @gotomirrors”

ఇది కూడా చదవండి :

Leave a Reply