Ram Charan: ఇండియాస్ బ్రాడ్ పిట్ చరణ్

Ram Charan

Ram Charan: ఇండియాస్ బ్రాడ్ పిట్ చరణ్: ప్రియాంక చోప్రా

Ram Charan: బాలీవుడ్‌ స్టార్‌ నటి, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రాన్ని తాను ఇప్పటి వరకూ చూడలేదని షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్‌’  వెబ్‌సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్‌ ప్రియాంకను ‘మీరు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చూశారా..?’ అని ప్రశ్నించారు. దీనికి ప్రియాంక ‘నో’ అని సమాధానమిచ్చింది. ‘నాకు సమయం లేదు.

నేను సినిమాలు చూడను. కానీ, టీవీ షోలు చూస్తుంటా’ అని బదులిచ్చింది.

ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా యూఎస్‌ (US) వెళ్లిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కి ఆతిథ్యం ఇచ్చిన ప్రియాంక ఆ సినిమాను చూడలేదని చెప్పడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరో విషయం ఏంటంటే యూఎస్‌లో ఏర్పాటు చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రీనింగ్‌కి కూడా ఆమె హాజరైంది.

Also Watch

Godavari: గోదావరి జిల్లాల్లో భానుడి భగభగలు

ఆ సమయంలో టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి దిగిన ఫొటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకుంటూ  చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది.

ఇప్పుడేమో ఆ సినిమాను నేను ఇంత వరకూ చూడలేదు అని ప్రయాంక చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అయితే దీనిపై ఇప్పుడు చరణ్ కో స్టార్ మరియు ఇప్పుడు హాలీవుడ్ లో సెటిల్ అయ్యిన ప్రముఖ ఇండియన్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా జోన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.

ఇంటర్వ్యూ లో చరణ్ ని ఇండియాస్ బ్రాడ్ పిట్ అంటే ఒప్పుకుంటారా అని అడగ్గా దానికి అవును ఖచ్చితంగా అంటూ చరణ్ కి మంచి చరిష్మా ఉందని కాకపోతే నాకు బ్రాడ్ పిట్ కోసం తెలీదు బట్ రామ్ ఈజ్ నైస్ అంటూ బదులిచ్చింది.

దీనితో చరణ్ పై తన కామెంట్స్ ఇప్పుడు మంచి వైరల్ గా మారాయి.

అలాగే బ్రాడ్ పిట్, చరణ్ ఎవరు ఎక్కువ అందగాడు అనే ప్రశ్నకు   అడిగినప్పుడు, ప్రియాంక బదులిస్తూ, “నేను బ్రాడ్ పిట్‌పై ప్రేమతో పెరిగాను, కాబట్టి ఆ ప్రశ్న అడగడం రామ్‌కి అన్యాయం అవుతుంద’ని ప్రేర్కొంది.

చివరిగా ‘రామ్ చరణ్ లేదా ఎన్టీఆర్ ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు?’ అంటూ ప్రశ్నించగా.. చిరునవ్వు నవ్వి దాటవేసింది. ఇక రామ్ చరణ్ – ప్రియాంక చోప్రా జంటగా ‘జంజీర్’ (తుఫాన్)లో నటించిన విషయం తెలిసిందే.

ఆస్కార్ ఈవెంట్ లో వీరు చాలా రోజుల తర్వాత కలవడం ఫ్యాన్స్ సంతోషంగా ఫీలయ్యారు.  చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh