Ongole: వైఎస్‌ఆర్‌సీపీ జెండాలు లేకుండానే బాలినేని

Ongole

Ongole: వైఎస్‌ఆర్‌సీపీ జెండాలు లేకుండానే ఒంగోలులో బాలినేని బలప్రదర్శన, అసలేంటి కథ..?

Ongole: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి కొద్ది రోజులుగా అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నా సంగతి తెలిసిందే. చాలా రోజుల విరామం తర్వాత ఆయన ఈరోజు ఒంగోలు వచ్చారు. బాలినేని ఒంగోలు ప్రవేశం సందర్భంగా వందలాది మంది కార్యకర్తలు రైల్వేస్టేషన్‌కు వచ్చినా ఎక్కడా  వై యస్ ఆర్ సీపీ పార్టీ జెండా కానీ    కండువా కనిపించలేదు.

కాగా గత కొంత కాలలంగా అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నా మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఆ మధ్యలో సీఎం జగన్ నుంచి పిలుపు రావడంతో తాడేపల్లి వెళ్లి ఆయనను కలిసి మళ్ళీ హైదరబాద్ వెళ్లిపోయారు. హైదరాబాద్, అమరావతి వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలిసి మళ్ళీ తిరిగి ఒంగోలుకు వచ్చినప్పుడు పెద్దగా హడావిడి లేకపోయినా ఇప్పుడు రైలు దిగగానే పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి నినాదాలు చేసి ఆయనకు ఘనస్వాగతం పలికారు.దానికి తోడు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న ఆ వీడియోలకు జై బాలయ్య పాటను జోడించి బాలినేని అధికారిక ఫేస్‌బుక్ పేజీలో కూడా ఈ వీడియో కనిపించడం విశేషం.  ఆ వీడియో లో  అందరూ అతని కోసం పూలు తెచ్చారు. కారు వద్దకు వచ్చి జిందాబాద్‌ కొట్టారు. జై బాలినేని చెప్పినా జై జగన్ నినాదాలు వినిపించలేదు.

కాగా  ఇటీవల పార్టీ సమన్వయకర్త పదవికి బాలినేని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై జగన్ కు ఫోన్ చేసి బుజ్జగించినా వినలేదు. ఆ తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చారు. బాలినేని అభిమానులు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. ఈ ఘన స్వాగతం ఆయన పార్టీకి దూరమవుతున్నారనే వార్తలకు బలం చేకూర్చేలా కనిపిస్తోంది.

బాలినేని బలప్రదర్శన, అసలేంటి కథ..?

బాలినేని వైసీపీలో ఉండాలనుకుంటే జగన్ మాటలకు కచ్చితంగా గౌరవం ఇచ్చేవారేమో. కానీ ఆయన కోఆర్డినేటర్ పదవి తనకు వద్దంటే వద్దని చెబుతున్నారు, తాను కేవలం కేవలం నియోజకవర్గానికే పరిమితం అవుతానని చెబుతున్నారు. జిల్లాలో ఇటీవల మార్కాపురం సభలో జరిగిన అవమానం బాలినేనికి బాగా కలిసొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు ఇటీవల జిల్లాలో డీఎస్పీల నియామకంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తాడేపల్లికి వచ్చిన సందర్భంగా కూడా ఆయన పోలీసు నియామకాలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి లేకపోయినా జిల్లాలో తన హవా ఉంటుందని గతంలో అధిష్టానం చెప్పిందని, కానీ ఇప్పుడు పోలీస్ ల బదిలీల విషయంలో కూడా తన మాట చెల్లుబాటు కాకపోవడం ఏంటని ఉన్నతాధికారుల్ని ఆయన నిలదీశారని అంటున్నారు.

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని వైసీపీలో చేరిన తర్వాత తొలిసారి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో ఓడిపోయినా, 2019లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్‌లో స్థానం సంపాదించారు. రెండోసారి పదవి కోల్పోయినా ఆయన హవా తగ్గలేదు. కానీ రాను రాను బాలినేని వ్యవహారంలో మార్పు వచ్చింది. మార్కాపురం సభ విషయంలో పోలీసులు తన వాహనాన్ని అడ్డుకోవడం ఘోర అవమానంగా భావించారు. ఆయన ఇప్పటికే జనసేనతో టచ్‌లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా జనసేన ప్రకాశం జిల్లా నాయకులు కూడా బాలినేని వస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఈ వార్తలన్నీ ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో బాలినేని ఒంగోలుకు రైలులో వచ్చిన ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలకడం మరింత సంచలనంగా మారింది. ఐతే బాలినేని వైసీపీ విషయంలో ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంటారో ముందే తేలిపోతుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh