Nepal Aircraft Crash:నేపాల్‌లో ఘోర ప్రమాదం, రన్‌వేపై క్రాష్ అయిన విమానం – ఫ్లైట్‌లో 72 మంది

Nepal Aircraft Crash: నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది.

Nepal Aircraft Crash:

నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 72 మందితో కూడిన ఎయిర్‌క్రాఫ్ట్ పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై క్రాష్ అయింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎంత మంది చనిపోయారు..? అన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ 72 మందిలో 68 మందిప్రయాణికులు కాగా..మిగతా నలుగురు విమాన సిబ్బంది. ఓల్డ్ ఎయిర్‌పోర్ట్, పొఖారా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మధ్య ఫ్లైట్ క్రాష్ అయినట్టు Yeti Airlines వెల్లడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖాట్మండు నుంచి పొఖారాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటివరకూ 16 మంది మృతదేహాలు వెలికి తీసినట్టు తెలుస్తోంది. వాతావరణం అనుకూలంగా లేని కారణంగా పొఖారా విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ చేసే సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు, పొగ రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది.

https://twitter.com/ANI/status/1614510500121047040?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1614510500121047040%7Ctwgr%5Eb325f83d6644f4a028e4efc6ae5bfeef64b7b5cb%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fnews%2Fnepal-aircraft-crash-72-seater-passenger-aircraft-crashes-on-runway-at-pokhara-international-airport-rescue-operations-underway-73190

 

https://twitter.com/ANI/status/1614501109997133826?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1614502155876208642%7Ctwgr%5Eb325f83d6644f4a028e4efc6ae5bfeef64b7b5cb%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fnews%2Fnepal-aircraft-crash-72-seater-passenger-aircraft-crashes-on-runway-at-pokhara-international-airport-rescue-operations-underway-73190

 

https://twitter.com/ANI/status/1614501109997133826?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1614501109997133826%7Ctwgr%5Eb325f83d6644f4a028e4efc6ae5bfeef64b7b5cb%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fnews%2Fnepal-aircraft-crash-72-seater-passenger-aircraft-crashes-on-runway-at-pokhara-international-airport-rescue-operations-underway-73190

Leave a Reply