Delhi Liquor Case: జైలులో నుండి మనీశ్ సిసోడియా ఆసక్తికరమైన ట్వీట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ ఉదయం ఆయన ట్విటర్ వాల్‌పై ఓ సందేశం పోస్ట్ అయ్యింది.
”సార్ నన్ను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టవచ్చు కానీ నా ఆత్మను విచ్ఛిన్నం చేయలేరు. బ్రిటిష్ వాళ్లు స్వాతంత్ర్య సమరయోధులను కూడా ఇబ్బందులకు గురి చేశారు. కానీ, వాళ్ల ఆత్మ విరిగిపోలేదు జైలు నుంచి మనీష్ సిసోడియా సందేశం” అంటూ ట్వీట్ పోస్ట్ అయ్యింది.
ఇదిలా ఉంటే తాజాగా ఆయన్ని ఈడీ వారం కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవినీతికి పాల్పడినట్లు అభియోగాలను నిర్ధారించుకున్న సీబీఐ ఫిబ్రవరి 26వ తేదీన ఆయన్ని అరెస్ట్ చేసింది. కోర్టు రిమాండ్‌తో ఆయన్ని తీహార్ జైలుకు తరలించారు. అయితే
గురువారం విచారణ పేరిట ఆయన్ని ప్రశ్నించిన ఈడీ చివరకు అరెస్ట్ చేసింది. ఆపై కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంది. శనివారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణలో ఆయన భాగం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్‌కు హైదరాబాద్(తెలంగాణ) వేదిక అయ్యిందని, నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో కీలక చర్చలు జరిగినట్లు ఈడీ అధికారులు సిసోడియా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాదు కవిత, సిసోడియా మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు ప్రస్తావించారు.
https://twitter.com/msisodia/status/1634403034024271872?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1634403034024271872%7Ctwgr%5E7a136a6ce5cea3acf823caf4fea507f3dcff6fa9%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnew
ఇది కూడా చదవండి :