Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ లాల్ సలాం పై  

Lal Salaam

Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ లాల్ సలాం పై  నిరాశ చెందిన అభిమానులు

Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లాల్ సలామ్”. తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి రజినీ ఫస్ట్ లుక్ ను మే 8  రిలీజ్ చేశారు మేకర్స్.  రజినీ ముస్లిం గెటప్ లో కనిపిస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో మొయిదీన్ భాయ్‌ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు రజిని. ఇక ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఐశ్వర్య “మొయిదీన్‌భాయ్…స్వాగతం! మీ గుండె పరుగెత్తుతున్నప్పుడు లల్‌స్లామ్ క్యాప్షన్ ఇవ్వలేరు అంటూ రాసుకొచ్చింది. ఇక సినిమాని నిర్మిస్తున్న లైకా తన ట్విట్టర్ ఖాతాలో మన అందరి ఫేవరెట్ భాయ్  మళ్ళీ ముంబై కి వచ్చాడు. స్వాగతం పలకండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

రజినీకాంత్ లాల్ సలాం పోస్టర్ పై విపరీతమైన ట్రోలింగ్ ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. మే 8న ఐశ్వర్య రజినీకాంత్, లైకా ప్రొడక్షన్స్ తమ సోషల్ మీడియా పేజ్లలో తలైవర్ ఫస్ట్ లుక్ పోస్టర్ను షేర్ చేశాయి. అయితే ఈ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ద్వేషాన్ని చూరగొంటోంది. నిరాశ చెందిన అభిమానులు తమ విచారాన్ని  ఐశ్వర్య, పోస్టర్ డిజైనర్ పై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. కొందరు ట్విట్టరిస్టులు ఆ పోస్టర్ ను తొలగించాలని చిత్రబృందాన్ని కోరారు.

Also Watch This

IPL Points Table 2023: రాజస్థాన్ రాయల్స్ పై విజయంతో

ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించగా   రజినీకాంత్ అతిథి పాత్రలో నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ విష్ణు రంగసామి, ఎడిటర్ ప్రవీణ్ భాస్కర్ టెక్నికల్ టీంలో ఉన్నారు.  ఇక లేటెస్ట్ అప్డేట్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. ఎ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సూపర్ స్టార్ కూడా ప్రస్తుతం సీనియర్, స్టార్ దర్శకులతో కాకుండా యంగ్ జెనరేషన్ టాలెంటెడ్ దర్శకులని తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం ఎంపిక చేసుకుంటున్నారు. ఐశ్వర్య రజినీకాంత్ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. అలాగే తెలుగులో దిల్ రాజు ప్రొడక్షన్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందనే ప్రచారం.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh