Kerala: కేరళలో పడవ బోల్తా 22కి చేరిన మృతుల సంఖ్య

Kerala

Kerala: కేరళలో పడవ బోల్తా 22కి చేరిన మృతుల సంఖ్య

Kerala:కేరళలో జరిగిన పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి చేరింది. . తానూర్ ప్రాంతంలోని తువల్తీరం బీచ్ సమీపంలో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో 4 0 మందికి పైగా ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే సామర్ధ్యానికి మించి బోటులో పర్యాటకులను ఎక్కించడంతోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. బోటు యజమానిపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ప్రమాద సమయానికి బోటులో ఎంత మంది ఉన్నారనేది మాత్రం స్పష్టత లేదు. 40 మంది టిక్కెట్లు తీసుకోగా.. కొందరు టిక్కెట్ లేకుండా ఎక్కినట్టు తెలుస్తోంది. అంతేకాదు, పడవకు ఎటువంటి సేఫ్టీ సర్టిఫికెట్ లేదని గుర్తించారు.

గల్లైంతన వారికోసంనేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), ఇండియన్ కోస్ట్ గార్డ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.   ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సహా పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేంద్రం తరఫున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2.2 లక్షలు ఆర్ధిక సాయం ప్రధాని ప్రకటించారు.”కేరళలోని మలప్పురంలో జరిగిన పడవ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయినందుకు బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాము. మరణించిన ప్రతి కుటుంబానికి పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించబడుతుంది” అని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో చెప్పారు.

మలప్పురంలో పడవ ప్రమాదం ఘటన వార్త తీవ్రంగా కలిచివేసింది.. విషాదకర ఘటనలో ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.. రెస్క్యూ ఆపరేషన్‌లో అధికారులకు కాంగ్రెస్ కార్యకర్తలు సాయం చేయాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

మరోవైపు, ఘటనా స్థలాన్ని  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరియు ప్రతిపక్ష నాయకుడు వి డి సతీశన్ ప్రమాద స్థలాన్ని సందర్శిస్తారు, ఇక్కడ సహాయక చర్యలను మంత్రులు పిఎ మహ్మద్ రియాస్ మరియు వి అబ్దురహిమాన్ సమన్వయం చేస్తున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సంతాప దినం ప్రకటించి అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh