Kamal Haasan :పై గాయని చిన్మయి

Kamal Haasan

Kamal Haasan :పై గాయని చిన్మయి శ్రీపాద విమర్శలు

Kamal Haasan : తమిళ సూపర్‌స్టార్-రాజకీయవేత్త కమల్ హాసన్‌పై గాయని చిన్మయి శ్రీపాద విమర్శలు గుప్పించారు

తమిళ చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న ఆరోపణపై మౌనంగా ఉన్నారని ఆరోపించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్

ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నెల రోజులుగా నిరసనలు చేస్తున్న

మహిళా రెజ్లర్లకు సంఘీభావం తెలుపుతూ కమల్ చేసిన ట్వీట్‌పై చిన్మయి ఈ వ్యాఖ్యలు చేశారు.

బిజెపి లోక్‌సభ ఎంపి అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఒక మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్‌లను లైంగికంగా

వేధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వారం రోజుల క్రితం నిరసన తెలిపిన రెజ్లర్లకు కమల్ మద్దతు తెలిపారు.

తన ట్వీట్‌లో, నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడి కంటే జాతీయ క్రీడా చిహ్నాల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని అతను ప్రశ్నించాడు.

ఈరోజు రెజ్లింగ్ సహోదరుల అథ్లెట్ల నిరసనలకు 1 నెలని సూచిస్తుంది. జాతీయ కీర్తి కోసం పోరాడే బదులు,

వ్యక్తిగత భద్రత కోసం పోరాడాలని మేము వారిని బలవంతం చేసాము. తోటి భారతీయులారా, మన దృష్టికి అర్హుడు ఎవరు, మన

జాతీయ క్రీడా దిగ్గజాలు లేదా విస్తృతమైన నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడా?’’ అని కమల్ ట్వీట్ చేశారు.

ఇలా కమల్ హాసన్ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ పై స్పందించిన సింగర్ చిన్మయి ఘాటుగా రిప్లై ఇచ్చారు.

మహిళలపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించినందుకు తమిళనాడులో గత ఐదు సంవత్సరాలుగా

ఒక మహిళపై నిషేధం(Banned) విధించారు.ఈ ఘటన అందరి కళ్ళముందే జరిగిన కేవలం ఆ

రచయితతో ఉన్నKamal Haasan :  పరిచయం కారణంగా ఎవరు ఈ ఘటనపై నోరు విప్పలేదు.

తమ చుట్టూ ఇలాంటి ఘటనలు జరుగుతున్న పట్టించుకోకుండా మాట్లాడే రాజకీయ నాయకులను(Political Leaders)

ఎలా నమ్మాలి అంటూ కమల్ హాసన్ చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ చిన్మయి చేసిన ఈ పోస్ట్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే, తమిళనాడు లెజెండరీ లిరిక్ రైటర్‌గా పేరు తెచ్చుకున్న వైరముత్తుపై (Vairamuthu)

గతంలో లైంగిక ఆరోపణలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఓపెన్‌గా ప్రశ్నించినందుకు

సింగర్ చిన్మయిపై కొన్నేళ్లు కోలీవుడ్‌లో బ్యాన్ విధించారు. అయినప్పటికీ చిన్మయి మాత్రం ఇప్పటికీ తన

వ్యాఖ్యలకు కట్టుబడే ఉంది. వీలు దొరికినప్పుడల్లా వైరముత్తుపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తుంటుంది.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో కోలీవుడ్‌ పెద్దల నుంచి చిన్మయికి ఎలాంటి సహకారం లభించలేదు.

వైరముత్తు ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి కావడంతో ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు.

రజినీకాంత్, కమల్ హాసన్ సైతం స్పందించలేదు. అందుకే కమల్ రీసెంట్‌‌గా రెజ్లర్లకు మద్దతుగా చేసిన

ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చింది చిన్మయి.ఇక ఈ ఇష్యూలో పలువురు నెటిజన్లు

చిన్మయికి సపోర్ట్ చేస్తుండగా Kamal Haasan : మరికొందరు  విమర్శింస్తున్నారు .

Leave a Reply