K Vasu : దర్శకుడు కే వాసు మరణం పై సంతాపం

K Vasu

K Vasu : దర్శకుడు కే వాసు మరణం పై సంతాపం తెలిపిన మెగా బ్రదర్స్

K Vasu :  సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న మరణాలు అందర్నీ కలిచి వేస్తున్నాయి.

ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె వాసు నిన్న (మే 26) కన్నుమూశారు.

గత కొంతకాలంగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా ఆయన నిన్న కిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కృష్ణంరాజు హీరోగా ‘ఆడపిల్లల తండ్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచమైన వాసు చిరంజీవిని

‘ప్రాణం ఖరీదు’ సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు. ఇక ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఈ నేపధ్యం లో  మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. కె వాసు మృతి పట్ల

సంతాపం తెలిపారు`సీనియర్ దర్శకులు కె.వాసు ఇక లేరు అనే వార్త ఎంతో బాధించింది.

నా కెరీర్ తొలి రోజుల్లో  చేసిన  `ప్రాణం ఖరీదు`, `తోడుదొంగలు` `అల్లుళ్లు వస్తున్నారు`,

`కోతల రాయుడు` చిత్రాలకి ఆయన K Vasu :  దర్శకత్వం వహించారు. ఆయన కుటుంబ సభ్యులకు

నా ప్రగాఢ సంతాపం` అని ట్విట్టర్‌ ద్వారా తన విచారం వ్యక్తం చేశారు చిరు. చిరంజీవి నటుడిగా

టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది `ప్రాణం ఖరీదు` సినిమాతోనే అనే విషయం తెలిసిందే.

అసలు  చిరుని టాలీవుడ్‌కి పరిచయం చేశారని చెప్పొచ్చు.

దర్శకులు శ్రీ కె వాసు గారు కన్నుమూశారని తెలిసి చింతించాను.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్నయ్య చిరంజీవి గారు

ముఖ్య పాత్రలో నటించిన ప్రాణం ఖరీదు సినిమా దర్శకులుగా శ్రీ వాసు గారిని మరచిపోలేం.

చిరంజీవి గారు తొలిసారి వెండి తెరపై కనిపించింది ఆ సినిమాతోనే. వినోదాత్మక కథలే కాకుండా

భావోద్వేగ అంశాలను తెరకెక్కించారు. శ్రీ కె.వాసు సినిమాల్లో శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం ప్రత్యేకమైనది.

తెలుగునాట షిర్డీ సాయిబాబా చరిత్ర ప్రాచుర్యం పొందటంలో ఆ సినిమా ఓ ముఖ్య కారణమైంది.

శ్రీ వాసు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ

1974లో `ఆడపిల్లల తండ్రి` చిత్రంతో దర్శకుడిగా మారారు కె వాసు.

ఇందులో కృష్ణంరాజు, నాగభూషణం, భారతి ప్రధాన పాత్రల్లో నటించారు.

దీనికి దర్శకత్వం వహించడమే కాదు, నిర్మాతగా, రచయితగా వర్క్ చేసి చిన్న వయసులోనే

మూడు విభాగాల్లో పనిచేసిన దర్శకుడిగా రికార్డు క్రియేట్‌ చేశారు కె వాసు.

ఆ తర్వాత కొంత గ్యాప్‌తో చిరంజీవి, జయసుధ, చంద్రమోహన్‌, మాధవి, నూతన్‌ ప్రసాద్‌,

రావు గోపాలరావు లు నటించిన `ప్రాణం ఖరీదు` చిత్రానికి దర్శకత్వం వహించి మెప్పించారు.

ఆయన చివరగా 2008లో `గజిబిజి` చిత్రాన్ని రూపొందించారు.

అంతకు ముందుK Vasu :  శ్రీకాంత్‌,ప్రభుదేవాలతో `ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి` చిత్రాన్ని తీశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh