IT Raids: రాముని పేరు చెప్పి రౌడీయిజమా ?.. మీ దాడులకు భయపడేది లేదు: కవిత

IT Raids: బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఆ పార్టీ నాయకులు రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీలో చేరకపోతే ఈడీ, ఐటీ దాడులతో బెదిరిస్తున్నారని.., ఆ దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట మండ‌ల ప‌రిధిలోని నాగిరెడ్డిపేట‌లో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కవిత.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత నెల రోజులుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు టార్గెట్‌గా కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.

” బీజేపీ వాళ్లకు తెలంగాణలో ఏం పని ఉంటది. వారికి ఉన్నది ఒక్కటే పని. రామ్ రామ్ జ‌ప్నా.. ప‌రాయి లీడ‌ర్ అప్నా. పక్క పార్టీల నుంచి, బ‌య‌టి లీడర్లను తీసుకువ‌చ్చి రాజ‌కీయం చేయ‌డం బీజేపీ ప‌ని. పక్క పార్టీలలోని పెద్ద లీడర్లను బీజేపీలో చేరకపోతే ఈడీ, ఐటీల‌తో కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. నెల రోజుల నుండి ఒక్క మంత్రిని, ఎంపీనీ, ఎమ్మెల్యేలను వదలకుండూ ఈడీ, ఐటీలతో రైడ్లు చేయిస్తున్నరు. మీరు ఎం చేసుకుంటారో చేసుకోండి.. తెలంగాణ వాళ్లు బ‌య‌ప‌డే వాళ్లు కాదు. వ్యాపారం లీగ‌ల్ చేసుకుంటారు. తప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు. నిజాయితీగా వ్యాపారం చేసుకునేటోళ్ల మీద మీరు బెదిరింపులకు పాల్పడితే ఎవరూ సహించరు. ఈడీ, ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు మా మంత్రులు, ఎమ్మెల్యేలు స‌మాధానం చెబుతారు.” అని కవిత వ్యాాఖ్యానించారు.

ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ కవిత (Kavitha) స్పష్టం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా టీఆర్ఎస్‌ (TRS) నేతలు ఆగం కావద్దని సూచించారు. తెలంగాణలో బీజేపీకి ఏం పని? అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ (BJP)కి నాయకుడు లేడని, ఐడియాలజీ లేదని తప్పుబట్టారు. రామ్ రామ్ జప్నా.. పరాయి లీడర్ అప్నా పాలసీ అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. బీఎల్‌ సంతోష్ ఎందుకు కోర్టుకు రావడం లేదు?… ఆయనను ఎందుకు అరెస్ట్‌ చేయొద్దు? అని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ పిలిస్తే తాము వెళ్లాలి.. కానీ వాళ్లు (బీజేపీ) మాత్రం రారని కవిత విమర్శించారు.

 

Dimple Hayathi In Shankars Movie keerthi suresh