IPL 2023: ఢీ కొట్టనున్నా ఆర్ సి బి , ఢిల్లీ క్యాపిటల్స్‌

IPL 2023

ఢీ కొట్టనున్నా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌

IPL 2023: ఐపీఎల్‌ 2023లో భాగంగా నేడు డబుల్‌ బొనాంజా ఉంది. మరికొద్దిసేపట్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఢీ కొట్టనున్నాయి. బెంగళూరు వేదికగాచిన్న జీయర్ స్వామి స్టేడియం లో  జరగనున్న ఈ IPL 2023 మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
శనివారం నాటి మ్యాచ్‌లో ఇరు జట్లు ఒకే మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. ఢిల్లీ జట్టులోకి మిచెల్‌ మార్ష్‌ రాగా.. స్పిన్నర్‌ వనిందు హాసరంగా ఆర్సీబీ జట్టులోకి చేరాడు. ఇక ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించగా ఢిల్లీ ఇంకా ఖాతా తెరవలేదు.

ఓటములతో సతమతం అవుతున్న రెండు జట్ల మధ్య శనివారం ఆసక్తికర పోరు జరగనుంది. తొలి మ్యాచ్ లో గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ ఓడింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అయితే IPL 2023 లో విజయం అనేదే లేకుండా సాగుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ ఓడింది. ఇరు జట్లు కూడా తమ ఆఖరి మ్యాచ్ ల్లో ఆఖరి బంతికి ఓడటం గమనార్హం. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరిగే కీలక పోరులో టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఒక మార్పు చేసింది. రోవ్ మన్ పావెల్ స్థానంలో మిచెల్ మార్ష్ ను తుది జట్టులోకి తీసుకుంది. ఆర్సీబీ కూడా ఒక మార్పు చేసింది. డేవిడ్ విల్లీ స్థానంలో హసరంగను తుది జట్టులోకి తీసుకుంది.

తుదిజట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్.

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (వికెట్‌ కీపర్‌), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh