Hyderabad: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ….

Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం …. నలుగురు విద్యార్థులు దుర్మరణం

Hyderabad: హైదరాబాద్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగ్ సీబీఐటీ కళాశాల వద్ద ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఓ కారు లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు.

అయితే కారులో మొత్తం 12 మంది ఉండగా. కారులో ఇరుక్కుపోయి కేకలు వేస్తున్న క్షతగాత్రులను బయటకు తీసే ప్రయత్నం చేశారు స్థానికులు.

Also Watch

Siddaramaiah: రేపే సిద్దరామయ్య కేబినెట్ ప్రమాణ స్వీకారం

వెంటనే వారందరినీ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆలోపే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా.

పోస్టుమార్టం పూర్తయిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.  క్షతగాత్రులను కూడా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే మృతులు ముగ్గురు నిజాంపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కాగా, మృతులను అంకిత, అర్షిత, అమృత, నితిన్‌లుగా గుర్తించారు.

విచారణలో భాగంగా ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది.

అయితే మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరగడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

శంకర్ పల్లి నుండి గండిపేట్ సైడ్ వెళ్తున్న సమయంలో ఖానాపూర్ చౌరస్తా వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది.

నిజాంపేటకు చెందిన దివ్యకు పెళ్లి నిశ్చయమైంది. దీంతో బ్యాచిలర్ పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి టిఫిన్ చేయడానికి కారులో నార్సింగి సీబీఐటీ నుంచి ఖానాపూర్ కు వెళ్లారు.

తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి పోచమ్మ ఆలయం వద్ద నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ప్రమాదం ధాటికి కారు నుజ్జు నుజ్జు అయింది. అయితే, కారులోని బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ ముందు సీట్లలో కూర్చున్నవారి ప్రాణాలను అవి కాపాడలేకపోయాయి.

తీవ్ర గాయాలపాలవ్వడంతో దివ్యతోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

One thought on “Hyderabad: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ….

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh