భాగ్యనగరం వాసులకు బంపర్ ఆఫర్

HYDERABAD GOOD NEWS FOR LIVING IN HYDERABAD

Hyderbad :భాగ్యనగరం వాసులకు బంపర్ ఆఫర్

భాగ్యనగరం లోట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రహదారుల అభివృద్ధి వ్యూహాత్మకంగా సాగుతోంది. ఇప్పటికే పలు ప్రధాన ప్రాంతాలు, కూడళ్లలో సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణం అందుబాటులోకి రాగా మరికొన్ని చోట్లా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవు తున్నాయి. వంతెనలు, అండర్‌పా్‌సలతో ఆయా ప్రాంతాల్లో రూపు రేఖలు పూర్తి గా మారుతున్నాయి.

ఇప్పటికే ఓ ఫ్లైఓవర్‌ అండర్‌పాస్‌ అందుబాటులోకి వచ్చిన ఎల్‌బీనగర్‌ చౌరస్తా వద్ద కుడివైపు వంతెన సిద్ధమైంది. త్వరలో ప్రారంభోత్సవం ఉంటుందని జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం  వర్గాలు చెబుతున్నాయి. అసలు ఈ ఫ్లైఓవర్‌ ఎప్పుడో అందుబాటులోకి రావాల్సి ఉన్నా ఆలయానికి సంబంధించిన స్థల సేకరణ, ఇతరత్రా కారణాలతో జాప్యం జరిగింది. స్థల సేకరణ జరగకపోవడంతో ఉన్నంతలో రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చారు. రూ.32 కోట్లతో 960 మీటర్ల మేర హయత్‌నగర్‌ వైపు నుంచి ఎల్‌బీనగర్‌ వైపు వచ్చేలా వంతెన నిర్మించారు.

గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో సిగ్నల్‌ చిక్కులకు చెక్‌పెట్టేలా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి దశలో రూ.8వేల కోట్లతో 42 ప్రాంతాల్లో పనులు చేపట్టారు. ఇందులో 18 వంతెనలు, ఐదు అండర్‌పా్‌సలు, ఎనిమిది చోట్ల ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలు కలిపి మొత్తం 31 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఐటీ రంగానికి కేంద్ర బిందువైన గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా చేపట్టారు. బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద రెండు లెవల్స్‌లో ఫ్లైఓవర్లు, మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ వద్ద వంతెన, అండర్‌పాస్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి  సులువైన రాకపోకల కోసం గచ్చిబౌలి వంతెన మీదుగా శిల్ప లేఅవుట్‌, కొండాపూర్ కూకట్‌పల్లిరాజీవ్‌గాంధీ చౌరస్తాల్లో వంతెనలు అయ్యప్ప సొసైటీ వద్ద అండర్‌పాస్‌ వినియోగంలోకి వచ్చాయి. ఐటీ కారిడార్‌ అనంతరం ఎక్కువగా ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్‌లు ఎల్‌బీనగర్‌లో చేపట్టారు. నాగోల్‌, కామినేని వద్ద కుడి, ఎడమ వైపు వంతెనలు, ఎల్‌బీనగర్‌ చౌరస్తా వద్ద ఓ వంతెన, అండర్‌పాస్‌, బైరామల్‌గూడ చౌరస్తా వద్ద ఎడమ, కుడి వైపు ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో మరో వంతెన ఇప్పుడు సిద్ధమైంది.

2030 వరకు పెరగనున్న వాహనాలు, అనుగుణంగా రహదారులు, ప్రజారవాణా వ్యవస్థ ఎలా మెరుగుపర్చాలన్నది అంచనా వేస్తూ  రవాణా అధ్యయన నివేదిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ప్రతిపాదించినవే ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులు. నగరంలో రహదారుల విస్తరణకు బదులు వంతెనల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అన్ని ప్రాంతాల్లో రూ.30వేల కోట్లతో వంతెనలు, అండర్‌పా్‌సలు, ఆర్‌ఓబీ ఆర్‌యూబీలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ పనులను దశల వారీగా చేపట్టాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply