సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒకే ఒక ట్రెండ్ వైరల్ అవుతోంది. చూడటానికి అచ్చం నిజమైన బొమ్మల్లా కనిపిస్తూ, చిన్నగా ముద్దుగా ఉండే 3D ఫిగరిన్స్ (Figurines) ఫొటోలు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్స్ అన్నీ వీటితో నిండిపోతున్నాయి. అయితే ఇవి చేతితో చేసిన బొమ్మలు కాదు, స్టోర్స్‌లో అమ్మే ఫిగరిన్స్ కూడా కావు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందిన 3D మోడల్స్. ఈ ట్రెండ్‌కు “నానో బనానా” అనే పేరే పెట్టారు. వీటిని ఎవరైనా ఎలాంటి ఖర్చు లేకుండా, కేవలం సెకన్లలో గూగుల్ జెమిని (Gemini 2.5 Flash) ఇమేజ్ టూల్‌తో క్రియేట్ చేయవచ్చు.

నానో బనానా 3D ఫిగరిన్ అంటే ఏమిటి?
నానో బనానా అనేది ఒక డిజిటల్ కలెక్టబుల్ (Digital Collectible). ఇది రియలిస్టిక్‌గా, పాలిష్ చేసిన చిన్న మినీ మోడల్‌లా కనిపిస్తుంది. చాలా ఫొటోలలో ఫిగరిన్‌తో పాటు దాని ప్యాకేజింగ్ బాక్స్ కూడా ఉంటుంది. వీటిని డబ్బు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. కేవలం AI టూల్ సాయంతో మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు, మన పెట్‌కి సూపర్‌హీరో డ్రెస్ వేసిన ఫిగరిన్, మన ప్రియమైన సెలబ్రిటీని చిన్న యాక్షన్ ఫిగరిన్‌గా మార్చడం లాంటివి క్షణాల్లో క్రియేట్ చేయవచ్చు. ఫైనల్ ఔట్‌పుట్ చూస్తే అచ్చం ప్రొఫెషనల్ స్టూడియోలో తీసిన ఫోటోలా ఉంటుంది. కొన్ని ఇమేజెస్ ఖరీదైన బ్రాండ్ల ప్యాకేజింగ్ లాగే కనిపిస్తాయి.

ఈ ట్రెండ్ ఎందుకు వైరల్ అయింది?
1. సింపుల్ ప్రాసెస్: డిజైనింగ్ స్కిల్స్ లేకపోయినా, డబ్బు ఖర్చు చేయకపోయినా.. కేవలం ఒక ఫోటో అప్‌లోడ్ చేసి లేదా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. జెమిని సెకన్లలోనే ఫిగరిన్‌ను క్రియేట్ చేస్తుంది. ఈ ఈజీ ప్రాసెస్, యూజర్ల క్రియేటివిటీ కలవడంతో ఇది సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.
2. ఫ్లెక్సిబిలిటీ: యూజర్లు టెక్స్ట్ ప్రాంప్ట్ లేదా ఫోటో + ప్రాంప్ట్ కాంబినేషన్ వాడొచ్చు. AI దానికి ఎక్స్‌ప్రెషన్స్, బట్టల టెక్స్చర్, బ్యాక్‌గ్రౌండ్ డీటెయిల్స్ జోడించి ఔట్‌పుట్‌ను హై-ఎండ్ బ్రాండ్ షూట్‌లా తయారు చేస్తుంది.
3. సెలబ్రిటీ ఇన్వాల్వ్‌మెంట్: పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, రాజకీయ నాయకులు కూడా తమ నానో బనానా ఫిగరిన్స్ పోస్ట్ చేయడంతో ఈ ట్రెండ్ మరింత బూస్ట్ అయింది. మొదట చిన్న ప్రయోగంలా మొదలైనది ఇప్పుడు గ్లోబల్ క్రేజ్‌గా మారింది.
From photo to figurine style in just one prompt.
People are having fun turning their photos into images of custom miniature figures, thanks to nano-banana in Gemini. Try a pic of yourself, a cool nature shot, a family photo, or a shot of your pup.
Here’s how to make your own 🧵 pic.twitter.com/e3s1jrlbdT
— Google Gemini App (@GeminiApp) September 1, 2025
నానో బనానా ఫిగరిన్ ఎలా క్రియేట్ చేయాలి?
జెమిని యాప్ లేదా వెబ్‌సైట్‌లో Google AI Studio ఓపెన్ చేయాలి.
కావాల్సిన మోడల్ ఎంచుకోవాలి.
ఒక ఫోటో అప్‌లోడ్ చేసి ప్రాంప్ట్ ఇవ్వవచ్చు లేదా కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ వాడవచ్చు. (ఫోటో + ప్రాంప్ట్ కాంబినేషన్‌తో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి).
గూగుల్ తన X అకౌంట్‌లో అఫీషియల్‌గా షేర్ చేసిన ప్రాంప్ట్ వాడితే ఇంకా పర్ఫెక్ట్ ఔట్‌పుట్ వస్తుంది:
“Create a 1/7 scale commercialized figurine of the characters in the picture, in a realistic style, in a real environment. The figurine is placed on a computer desk. The figurine has a round transparent acrylic base, with no text on the base. The content on the computer screen is a 3D modeling process of this figurine. Next to the computer screen is a toy packaging box, designed in a style reminiscent of high-quality collectible figures, printed with original artwork. The packaging features two-dimensional flat illustrations.”
“Generate” బటన్ క్లిక్ చేయగానే కేవలం కొన్ని సెకన్లలో ఫిగరిన్ జనరేట్ అవుతుంది.
ఒకవేళ డిజైన్ నచ్చకపోతే ప్రాంప్ట్ మార్చి మళ్లీ ప్రయత్నించవచ్చు.
