DEECET: నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

DEECET

DEECET: నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

DEECET: తెలంగాణలో ఒక్కో ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. తాజాగా డీఈఈసెట్‌ 2023 ప్రకటన విడుదలైంది. జూన్‌ 1వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.  ప్రభుత్వ డైట్‌ కాలేజీతో పాటు, ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. DEECET ఎగ్జామ్‌ను జూన్‌ 1న నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ ఎస్‌ శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు. రెండేండ్ల వ్యవధి గల ఈ కోర్సులో ప్రవేశ పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తామన్నారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి మే 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌ ఈ నెల 22వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని, నోటిఫికేషన్‌ సహా ఇతర కోసం http://deecet.cdse.telangana.gov.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

ప్రవేశ పరీక్ష – DEECET 2023

2023 -25 విద్యా సంవ‌త్స‌రానికి గానూ ప్రవేశాలు కల్పిస్తారు.

దరఖాస్తులు – ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభం- ఏప్రిల్ 22వ తేదీ

దరఖాస్తులకు తుది గడువు – మే,22వ తేదీ, 2023

పరీక్ష తేదీ – జూన్ 1, 2023.

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు.

 అలాగే తెలంగాణ ఎడ్ సెట్ 2023 కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. బీఎడ్ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే తెలంగాణ ఎడ్‌సెట్ దర‌ఖాస్తు గ‌డువు పెంచారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ద‌ర‌ఖాస్తుల గ‌డువును ఏప్రిల్ 25వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ ఏ రామ‌కృష్ణ తెలిపారు. మే 18వ తేదీన ఎడ్ సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించున్నారు.

ప్రవేశ  పరీక్ష ఎడ్‌సెట్ 2023

మార్చి 4 – ఎడ్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల.

మార్చి 6 – అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

దరఖాస్తు రుసుం – ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 500, ఇత‌ర కేట‌గిరీల అభ్య‌ర్థులు రూ. 700 చెల్లించాలి.

ఎలాంటి ఆల‌స్య రుసుం లేకుండా ఏప్రిల్ 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మార్చి 30- అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మే 5 – ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

మే 18 – DEECET – 2023 ప్ర‌వేశ ప‌రీక్ష ఉంటుంది.

మే 21 – ప్రాథ‌మిక కీ విడుద‌ల చేస్తారు

Leave a Reply