Chepa Mandu: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో

Chepa Mandu

Chepa Mandu: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ

Chepa Mandu: ఆస్తమా రోగులకు శుభవార్త దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన చేప మందు ను బత్తిని సోదరులు త్వరలో పంపిణీ చేయనున్నారు.కొవిడ్‌ కారణంగా మూడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న చేప ప్రసాదం పంపిణీని ఈ సంవత్సరం తిరిగి ప్రారంభిస్తున్నామని  ట్రస్ట్‌ ప్రతినిధులు, బత్తిన కుటుంబ సభ్యులు ప్రకటించారు. మృగశిర కార్తి ప్రవేశించే జూన్‌ 9న నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు ట్రస్ట్‌ ప్రతినిధి బత్తిన అమర్నాథ్‌ గౌడ్‌ తెలిపారు.

జూన్‌ 9న ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు చేప మందు  ప్రసాదం పంపిణీ ఉంటుందన్నారు.అయితే ప్రసాదం కోసం వచ్చేవారు నాలుగు గంటల ముందు నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకూడదని సూచించారు.  ప్రసాదం తీసుకున్న అనంతరం  రెండు గంటల పాటు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దని తెలిపారు.

Chepa Mandu కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా  ఉబ్బసం వ్యాధి గ్రస్తులు శాశ్వతంగా వ్యాదిని నిర్మూలచుకోవడానికి   హైదరాబాద్ కు వస్తుంటారు. బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదం కోసం జనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు.   కరోనా తర్వాత తొలిసారి చేప ప్రసాదం పంపిణీ కావడంతో ఈ సారి  జనం భారీగా తరలి రానున్నారని అంచనా వేస్తున్నారు దానికి తగిన విధంగా వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply