BJP Nirudyoga march: ఈ రోజు సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్

BJP Nirudyoga march

BJP Nirudyoga march: ఈ రోజు సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్

BJP Nirudyoga march: సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే నిరుద్యోగ మార్చ్ ను విజయవంతం చేసి సత్తా చాటాలని పార్టీ క్యాడర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ విజయశాంతి ఆధ్వర్యంలో సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌజ్ నుంచి పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ వరకు నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, నేతలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు, టి.వీరేందర్ గౌడ్, ఆకుల విజయ, దరువు ఎల్లన్న, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ 30 లక్షల మంది యువత కోసం కొట్లాడుతోందని సంజయ్ తెలిపారు. కేసీఆర్ కుటుంబానికో న్యాయం, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలకో న్యాయమా అని ప్రశ్నించారు. విద్యార్ధులు చనిపోతే ముఖ్యమంత్రి మాట్లాడలేదని‘కేసీఆర్ ప్రభుత్వం గత 8 ఏండ్లుగా నిరుద్యోగుల గొంతు కోస్తోంది. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తానని గతంలో చెప్పిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత మాట మార్చి అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని సంజయ్ దుయ్యబట్టారు.

‘కానీ నేటికీ ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. 21 నోటిఫికేషన్లు విడుదల చేసినా ఏ ఒక్కటీ సక్రమంగా నిర్వహించలేదు. పేపర్ లీకేజీ పేరుతో సర్కారు నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటోంది. కేసీఆర్ కుటుంబంపైనే లీకేజీపై ఆరోపణలు వస్తున్నా.  కేసీ ఆర్ ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గు చేటు. లీకేజీకి ఐటీశాఖ నిర్లక్ష్యమే కారణమైనప్పటికీ కొడుకును బర్తరఫ్ చేయకపోగా, కాపాడుకోవడానికి యత్నిస్తున్నారు’ అని సంజయ్​ ధ్వజమెత్తారు.

Also watch

SS Rajamouli: ‘మహాభారతం’ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి

 

ఎన్నికలు వస్తున్నాయంటే నోటిఫికేషన్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం టైం పాస్ చేస్తోందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. కేంద్రం నిర్వహించే పరీక్షల్లో తప్పులు జరగట్లేదని ఆయన తెలిపారు. కేటీఆర్ రాజీనామా చేయాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నష్టపోయిన యువతకు రూ.లక్ష నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన కోరారు. నిరుద్యోగ మార్చ్‌కు ఎవరు రారన్నారని బీఆర్ఎస్ నేతలు కంటి వెలుగు ఆపరేషన్ చేసుకోవాలని బండి సంజయ్ చురకలంటించారు.

అసలు సీఎం మాత్రం సిట్ పేరుతో దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్​ఆరోపించారు. సిట్ చేసిన విచారణలకు ఇంతవరకు అతీగతీ లేదన్నారు. నయీం ఆస్తులు, డ్రగ్స్, మియాపూర్ భూముల కుంభకోణమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఈ విషయాలను  తాము ప్రస్తావిస్తుంటే ప్రజల దృష్టిని మళ్లించేందుకు టెన్త్ పేపర్ లీక్ పేరుతో తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని అన్నారు. అయినా తాను భయపడలేదని, తనను ఎక్కడ అరెస్ట్ చేశారో అక్కడి నుంచి నిరుద్యోగ మార్చ్ నిర్వహించి బీజేపీ సత్తా చూపామన్నారు.

Leave a Reply