Balu: బుల్లితెర నటులు మృతి

Balu:

Balu: బుల్లితెర నటులు మృతి

Balu:  తెలుగు సీరియల్ యాక్టర్ బాలు (32) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.

ఏటూరునాగారం మండలం రొయ్యూర్‌ గ్రామానికి చెందిన కుమ్మరి బాలు (32) కొన్నేళ్ల క్రితం స్వగ్రామం నుంచి హైదరాబాద్‌ వచ్చి అక్కడే స్థిరపడ్డాడు.

చిన్నప్పటి నుండి నటనపై ఇంట్రెస్ట్ ఉండటంతో.. సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.

తన నటనతో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు బాలు.

ఈ క్రమంలోనే మే 18న తన స్నేహితుడి వివాహానికి బైక్‌పై హైదరాబాద్‌ నుంచి కన్నాయిగూడెం మండలం దేవాదుల గ్రామానికి వెళ్లాడు.

పెళ్లి అనంతరం మే 19న తిరిగి హైదరబాద్‌కు బైక్‌పై బయల్దేరాడు.

అర్ధరాత్రి దాటిన తర్వాత యాదాద్రి సమీపంలో బాలు ప్రయాణిస్తున్న బైక్‌ అదుపుతప్పి చెట్టుకు బలంగా ఢీ కొట్టింది.

ఈ ఘటనలో బాలు అక్కడికక్కడే మృతి చెందాడు.

అయితే బాలుకు ముందు వెనక ఎవ్వరూ లేకపోవటంతో కష్టపడి బుల్లితెరలో నటిస్తూ ఇప్పుడిప్పుడే పైకొస్తున్నాడు.

కాగా.. ఇటీవలే వివాహం కూడా చేసుకున్నారు. ఇలాంటి సమయంలో..

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటం అటు గ్రామస్థులు, స్నేహితులను తీవ్రంగా కలచివేసింది

. ఈ విషయం తెలుసుకున్న బాలు భార్య Balu:   గుండెలు బాదుకుంది.

ఇక బాలు మృతి పట్ల అతని స్నేహితులు, తోటి నటీనటులు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.

అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న బాలు ఇలా మరణించడంతో సన్నిహితులు జీర్ణించుకోలేకున్నారు.

తాజాగా బెంగాల్​కు చెందిన ప్రముఖ టెలివిజన్ నటి రోడ్డు యాక్సిడెంట్​లో దుర్మరణం పాలయ్యారు.

షూటింగ్​ ముగిసిన తర్వాత టీవీ నటి సుచంద్ర దాస్​గుప్తా బైక్ ట్యాక్సీ మీద ఇంటికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాగనగర్​లో చోటుచేసుకుంది.

షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేందుకు సుచంద్ర  దాస్ గుప్తా  గరు ఒక యాప్ ద్వారా బైక్​ను బుక్ చేసుకున్నారు.

సుచంద్ర ఆ బైక్ మీద ప్రయాణిస్తుండగా దురదృష్టవశాత్తూ ఒక సైక్లిస్ట్ వారికి ఎదురుగా వచ్చాడు.

దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి హఠాత్తుగా బ్రేక్ వేశాడు. అదే టైమ్​లో వెనకాల కూర్చున్న నటి ఒక్కసారిగా కింద పడిపోయారు.

ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న ట్రక్ ఆమె మీద నుంచి దూసుకెళ్తింది. దీంతో సుచంద్ర దాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

హెల్మెట్ వేసుకున్నా ఆమె ప్రాణాలు దక్కలేదు.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న బారానగర్ Balu:  పోలీసులు ట్రక్కు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh