3వేల మార్క్ ను దాటిన కరోనా కేసులు

corona cases: 3వేల మార్క్ ను దాటిన కరోనా కేసులు

భారతదేశంలో మళ్ళీ కరోనా ఆందోళన కొనసాగుతుంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితి అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. భారతదేశంలో గత 24 గంటల్లో 3,016 తాజా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఒక్కసారిగా 40% కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. రోజువారి పాజిటివిటీ రేటు కూడా ఒక్కసారిగా పెరిగింది. 2.7% రోజువారి పాజిటివ్ రేటు, 1.71% వారం పాజిటివిటీ రేటు నమోదయింది
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా నవీకరించిన కరోనా డేటా ప్రకారం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య నేడు 13,509కి పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసులలో 0.03% గా ఉన్నాయి. ఇదిలా ఉంటే జాతీయ కోవిడ్ రికవరీ రేటు కూడా 98.78 శాతంగా నమోదయింది. గత ఐదు నెలలుగా బాగా తగ్గిన కరోనా కేసులు మళ్లీ ప్రస్తుతం పెరగడం ఆందోళనగా మారింది. ఇంకా గతేడాది అక్టోబర్ 2న 3,375 కరోనా కేసులు నమోదు కాగా మళ్లీ ఇప్పుడు కరోనా కేసులు మూడువేల మార్కును దాటింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 3016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివ్ రేటు 2.73 శాతంగా ఉంది. ఇదే సమయంలో 15,784 డోసుల కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 1,10,522 పరీక్షలు నిర్వహించగామొత్తం టెస్టుల సంఖ్య 92.14 కోట్లకు చేరింది.

ఇక దేశంలో తాజాగా 15 కరోనా మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ముగ్గురు, హిమాచల్ ప్రదేశ్లో గత 24 గంటల వ్యవధిలో ఒకరితోపాటు, కేరళలో సవరించిన డేటా తో 8మంది మరణాలు కలిపి 15మరణాలు నమోదు అయినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే నేడు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా శ్రీరామ కళ్యాణం వైభవంగా జరుగుతుంది. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

కాగా దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోవిడ్ -19 కోసం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే పెరుగుతున్న కరోనా కేసులు, దానిని అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ప్ర‌స్తుత ప‌రిస్థితులను అంచనా వేసేందుకు ఇటీవల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న ఉన్న‌త‌స్థాయి నిర్వహించారు.
 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh