ఫైనల్ కు చేరిన తెలుగు వారియర్స్ మరి కప్పు కొట్టనున్నార?

CCL2023 : ఫైనల్ కు  చేరిన తెలుగు వారియర్స్ మరి కప్పు కొట్టనున్నార?

క్రికెట్ ఎక్కడైనా సరే క్రికెట్. టీమిండియా ఆటగాళ్లు ఆడినా తెలుగు హీరోలు ఆడినా సరే ఎంటర్ టైన్ మెంట్ మాత్రం అస్సలు మిస్ కాదు. భారత జట్టు మ్యాచులు అనగానే కోహ్లీ, రోహిత్ శర్మ గురించి అందరూ మ్యాచులు చూస్తారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్(CCL)లో తెలుగు వారియర్స్ మ్యాచ్ ఉందంటే మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆటని ప్రతి ఒక్కరూ గమనిస్తారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్టింగ్ లో మంచిగా ఎంటర్ టైన్ చేసే ఇతడు ఇప్పుడు మన జట్టుని ఫైనల్ కి తీసుకెళ్లిపోయాడు. తాజాగా జరిగిన మ్యాచులో ఒంటిచేత్తో క్లాస్ ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టేశాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చివరిదశకు వచ్చేసింది. సెమీస్ లో అద్భుతమైన విజయం సాధించిన తెలుగు వారియర్స్ కప్ కోసం భోజ్ పురి జట్టుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైపోయింది. శుక్రవారం సెమీ ఫైనల్స్ జరిగాయి. విశాఖపట్నంలోని పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హోరహరీగా సాగాయి.

మరో  సెమీ ఫైనల్ లో తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పైనల్ కు దూసుకెళ్లింది. తెలుగు వారియర్స్ కు అఖిల్ అక్కినేని సారథ్యం వహించారు. కర్ణాటక బుల్డొజర్స్ కు ప్రదీప్ కెప్టెన్ గా వ్యవహరించాడు.

రెండో సెమీ ఫైనల్ లో కర్ణాటక జట్టు తొలి ఇన్సింగ్స్ లో పది ఓవర్లలో ఆరు వికెట్ల నష్టంతో 99 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన తెలుగు వారియర్స్ అదే ఆరు వికెట్ల నష్టంతో 95 పరుగులే చేసింది. దీంతో మూడు నాలుగు పరుగులు ఆధిక్యంతో సుదీప్ సేన నిలిచింది. తెలుగు వారియర్స్ బౌలర్ సామ్రాట్ మొదటి ఇన్సింగ్స్ లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది రెండో ఇన్సింగ్స్ లో కర్ణాటక టీమ్ 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. తెలుగు వారియర్స్ బ్యాటర్లు ధాటిగా బ్యాటింగ్ చేసి 103 పరుగుల లక్ష్యాన్ని ఛేధించారు. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లారు. రెండో ఇన్సింగ్స్ లో తమన్ ( 25 పరుగులు ) సాధించి ధనాధన్ ఆటతో మ్యాచ్ ను ముగించాడు. అంతకు ముందు భోజ్ పురి దబాంగ్స్, ముంబయి హీరోస్ మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్స్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఒక బంతి ఐదు పరుగులు చేయాల్సిన దశలో భోజ్ పురి దబాంగ్స్ జట్టు బ్యాటర్ ఆస్గర్ ఖాన్ సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు.

రెండో ఇన్సింగ్స్ ల్లో కలిపి ముంబయి హీరోస్ 171 పరుగులు చేయగా భోజ్ పురి దబాంగ్స్ జట్టు 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భోజ్ పురి దబాంగ్స్ విజయం సాధించింది.  దీంతో శనివారం జరిగే ఫైనల్లో తెలుగు వారియర్స్-భోజ్ పురి దబంగ్స్.. కప్ కోసం పోటీపడనున్నాయి.అయితే దిలా ఉండగా కొవిడ్ కారణంగా మూడేళ్లు వాయిదా పడిన సీసీఎల్.. రీలోడెడ్ పేరుతో ఈ ఏడాది రీ లాంచ్ చేశారు. 8 జట్లతో ఫిబ్రవరి 18న కొత్త సీజన్ ప్రారంభమైంది. ఇందులో ప్రతి జట్టు ఓ మ్యాచ్ లో 10 ఓవర్లు చొప్పున రెండు ఇన్నింగ్స్ లు ఆడుతూ వచ్చింది

. అలా సీజన్ ఆసాంతం కేక పుట్టించే ప్రదర్శన చేసిన తెలుగు వారియర్స్ ఫైనల్లో అడుగుపెట్టేసింది. ఇదే ఊపులో కప్ కూడా కొట్టేయాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అలానే తమన్ బ్యాటింగ్ కి ఫిదా అయిపోతున్నారు.  సెలబ్రిటీ క్రికెట్ లీగ్ -2023కి వచ్చిన స్పందన పట్ల చాలా సంతోషంగా ఉందని సీసీఎల్ స్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్థన్ ఇందూరి అన్నారు. ఈ సీజన్ లో ప్రతి జట్టుకు 10 ఓవర్ల చొప్పున 2 ఇన్సింగ్స్ లతో కూడి టీ20 ఫార్మాట్ నిర్వహించాం.. దాంతో వారు మరింత వినోదాన్ని అందించారు ఫైనల్స్ లో అంతకు మించిన పన్ ఉంటుందని. మరి ఈసారి విజేత ఎవరో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే అని మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్థన్ ఇందూరి వెల్లడించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh