కార్యకర్తల కృషితోనే బీజేపీ ఇంత అభివృద్ధి – ప్రధాని మోదీ

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నివాస సముదాయం, ఆడిటోరియంను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశంలో కుటుంబం నడిపే రాజకీయ పార్టీల మధ్య బీజేపీ ఒక్కటే ఇప్పుడు పాన్ ఇండియా పార్టీ అని అన్నారు. రెండు లోక్ సభ స్థానాలతో మొదలైన బీజేపీ ప్రస్థానం ఇప్పుడు 303 స్థానాలకు చేరుకుందని ప్రధాని అన్నారు.

తూర్పు నుంచి పడమరకు వరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి బీజేపీ ఒక్కటే పాన్ ఇండియా పార్టీ అని కొనియాడారు. బీజేపీ ప్రభుత్వం యువతకు పురోభివృద్ధికి అవకాశం కల్పిస్తున్నదని ఈ సందర్భంగా అన్నారు. టీవీలు    నుంచి, పత్రికల నుంచి వచ్చిన పార్టీ బీజేపీ కాదు. ట్విట్టర్, యూట్యూబ్ ఛానెళ్ల నుంచి కూడా రాలేదు. కార్యకర్తల కృషితోనే బీజేపీ ఇంత అభివృద్ధి చెందింది అని ప్రధాని మోదీ అన్నారు.

పార్లమెంటులో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు కలిసి ‘సేవ్ ది కరప్షన్’ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన నివాస సముదాయం, ఆడిటోరియంను ప్రారంభించిన అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై దర్యాప్తు సంస్థలు, కోర్టులు తీసుకున్న చర్యలను సమర్థించారు.

అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నప్పుడు దర్యాప్తును కించపరచడం మొదలుపెడతారని, న్యాయస్థానాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ అవినీతికి వ్యతిరేకంగా బిజెపి చేపట్టిన ఉద్యమం అవినీతి, అక్రమాలకు పాల్పడేవారి మూలాలను కదిలించిందని అన్నారు. 2004-14 యూపీఏ పాలనలో పీఎంఎల్ఏ కింద రూ.5,000 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని, బీజేపీ తొమ్మిదేళ్ల పాలనలో అది రూ.1.10 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు.

గతంతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో పీఎంఎల్ఏ కింద కేసులు నమోదయ్యాయని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే కాంగ్రెస్ హయాంలో బ్యాంకుల నుంచి రూ.22 వేల కోట్లు దోచుకున్నారని… బ్యాంకులను కొల్లగొట్టిన వారిలో చాలా మంది విదేశాలకు కూడా పారిపోయారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఈ వ్యక్తులకు చెందిన రూ.20 వేల కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుందన్నారు. ఇదంతా బిజేపి సాదించిన విజయం అని తెలిపారు మోడీ .

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh