‘ఎన్టీఆర్ 30’ సినిమా క్లాప్ఇచ్చి షూటింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి

NTR 30:’ఎన్టీఆర్ 30′ సినిమా క్లాప్ఇచ్చి షూటింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు ఏకధాటిగా ఆరు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు తారక్
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 30వ చిత్రం సెట్స్ పైకి వచ్చింది. దర్శకుడు కొరటాల శివతో తెలుగు ప్రాజెక్ట్  ఈ రోజు (గురువారం) పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమవుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఒక ఫోటోలో ఎన్టీఆర్ జూనియర్, జాన్వీ కరచాలనం చేస్తూ కనిపించారు. లైమ్ గ్రీన్ చీర, మ్యాచింగ్ బ్లౌజ్ లో అందంగా కనిపించిన దివంగత తార శ్రీదేవి కుమార్తెకు తెలుగు స్టార్ స్వాగతం పలికిన క్లిప్ ఉంది. మరో వీడియోలో ఎన్టీఆర్ జూనియర్, జాన్వీ వేదికపై రాజమౌళి పక్కన నిలబడి తొలి క్లాప్ షాట్ ఇచ్చి షూటింగ్ ప్రారంభాన్ని ప్రకటించారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ,  జాన్వీకపూర్‌, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు, సంగీత దర్శకుడు అనిరుధ్‌, నిర్మాత కల్యాణ్‌ రామ్‌ తదితరులు సందడి చేశారు. మరో ముఖ్య విషయమేమిటంటే ఆర్ఆర్ఆర్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసి, ఇటీవలే ఆస్కార్ పురస్కారాన్ని అందించిన దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రానికి క్లాప్ కొట్టగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కోస్టల్ ఏరియాలోని ల్యాండ్‌పై సాగే ఈ కథలో మనుషులకంటే ఎక్కువగా మృగాలుంటాయి దేవుడంటే భయం లేదు చావడమ్ అంటే  భయం లేదు ఒకటే ఒకటి అంటే భయం అదే ఈ సినిమా నేపథ్యం.యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ నటిస్తున్న ‘ఎన్టీఆర్ 30’ చిత్రానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తొలి క్లాప్ ఇచ్చారు.

 

 

.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh