ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పానున్నది ?

  ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపికబురు అందించేందుకు సిద్దంగా వున్నా మోదీ ప్రభత్వం

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించడానికి రెడీ అవుతోందా? పండుగ కానుక ప్రకటించబోతోందా? వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే నిజం అనే సమాధానం వినిపిస్తోంది. ఉద్యోగులకు వేతనాలు  భారీగా పెరగనున్నాయి. అలాగే పెన్షనన్లకు పెన్షన్ పెరగనుంది.

మోదీ సర్కార్ త్వరలోనే డియర్‌నెస్ అలవెన్స్ పెంచొచ్చనే అంచనాలు ఉన్నాయి. అసలు నివేదికలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అలాగే డియర్‌నెస్ రిలీఫ్ కూడా పకి చేరనుంది. దీని వల్ల ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. భారత ప్రభుత్వం ఈ సారి డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 4 శాతం మేర పెంచొచ్చనని తెలుస్తోంది. ఇదే జరిగితే డీఏ 42 శాతానికి చేనుంది. ప్రస్తుతం డియర్‌నెస్ అలవెన్స్ అనేది 38 శాతంగా ఉంది. డీఏ 42 శాతానికి చేరడం వల్ల ఉద్యోగుల వేతనాలు ఎంత పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డీఏ పెంపు అనేది బేసిక్ శాలరీ ప్రాతిపదికన ఉంటుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ శాలరీ నెలకు రూ. 25,500గా ఉందని అనుకుంటే ఈయనకు డీఏ రూ. 9690గా ఉంటుంది. అదే ఇప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతానికి చేరితే అప్పుడు ఏఏ రూ. 10,710కు చేరుతుంది అంటే అప్పుడు శాలరీ పెంపు అనేది ఉద్యోగులకు రూ. 1020గా ఉంటుంది నెలకు జీతం రూ. 1000 పెరుగుతుంది ఇక్కడ బేసిక్ వేతనం ఎక్కువగా ఉంటే వారికి డీఏ పెంపు కూడా ఎక్కువగా ఉంటుంది.

అలాగే పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ రిలీఫ్ అందిస్తారు. ఇది కూడా ప్రస్తుతం 38 శాతంగా ఉంది. 4 శాతం పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అంటే డీఆర్ 42 శాతానికి చేరొచ్చు. డీఆర్ పెరిగితే నెలవారీ పెన్షన్ అమౌంట్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్‌కు రూ. 35,400 బేసిక్ పెన్షన్ ఉందని అనుకుందాం. ఇప్పుడు వారికి 38 శాతం డీఆర్ ప్రకారం నెలకు రూ. 13,452 పెన్షన్ వస్తుంది. అదే డీఆర్ 42 శాతానికి చేరితే అప్పుడు నెలకు రూ. 14,868 వస్తాయి. అంటే అప్పుడు పెన్ష్ రూ. 1416 మేర పెరుగుతుందిడియర్‌నెస్ అలవెన్స్ లేదా డియర్‌నెస్ రిలీఫ్ పెంపు అనేది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. కాగా ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు డీఏ, డీఆర్ సవరిస్తుంది. జనవరి నుంచి జూన్ కాలానికి ఒకసారి, జూలై నుంచి డిసెంబర్ కాలానికి మరోసారి పెంపు ఉంటుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ పెంచితే ఆ నిర్ణయం  జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని గుర్తించుకోవాలి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh