మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తారా – జనసేనాని

అమరావతిలో బీజేపీ జాతీయ సత్యకుమార్‌పై దాడిని ఖండించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతికి మద్ధతు పలికిన సత్యకుమార్‌పై దాడి చేయడం సరికాదన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తారా. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు 1200 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికిన బీజెపీ జాతీయ కార్యదర్శి శ్రీ వై సత్య కుమార్ గరిపై వైసీపీదాదాగిరి పరాకష్టకు చేరిందనే వాస్తవం ఈ దాడితో మరో మారు తేటతెల్లమయింది. వైసీపీ దాదాగిరీ పరాకాష్టకు చేరింది. ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పవన్ పిలుపునిచ్చారు. రాజధాని రైతులకు మద్ధతుగా నిలిస్తే దాడులు చేస్తామని వైసీపీ పాలకులు సందేశం ఇస్తున్నారా, ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారి విధానం మేము కచ్చితంగా ప్రజాస్వామ్య పద్దతి లోనే సమాధానం ఇస్తాం అంటూ ఆయన దుయ్యబట్టారు. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారని వైసీపీ ఎంపీ చేసిన ప్రకటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

ఈ దాడిపై బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించాలని ఆయన కోరారు. మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెడుతున్న ముఖ్యమంత్రిని, ఆయన పార్టీని పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని జనసేనాని చురకలంటించారు. రాజధాని రైతులకు అండగా నిలుస్తున్న రాజకీయ పక్షాలను , సంఘాలను ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు శత్రువులుగా చూస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దౌర్జాన్యాలను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

కానీ దాడి జరిగేటప్పుడు తాను లంక పొలాల్లో ఉన్నానని తెలిపారు ఎంపీ నందిగం సురేశ్. తాను వెళ్లేటప్పటికే గొడవ మొత్తం జరిగిందన్నారు. అటు బీజేపీ నేతలపై నందిగం సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్లే గొడవ చేసేందుకు అక్కడికి వెళ్లారని ఆరోపించారు. ఇళ్లకోసం ధర్నాలు చేస్తున్న వారిపై దాడి చేస్తారా? అని మండిపడ్డారు. మహిళలను కూడా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్లు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. టీడీపీ డైరెక్షన్‌లోనే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని నందిగం సురేశ్ ఆరోపించారు.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh