భాగ్యనగర వాసులకు శుభవార్త ఈ నెల 8న హైదరాబాద్‌ కు ప్రధాని

PM Narendra Modi :భాగ్యనగర వాసులకు శుభవార్త ఈ నెల 8న హైదరాబాద్‌ కు ప్రధాని

హైదరాబాద్‌ నగరవాసులకు గుడ్ న్యూస్ త్వరలో   ప్రయాణ ప్రయాస తగ్గనుంది. ఇప్పటికే ప్రధాన ప్రాంతాలకు మెట్రో రైలు ద్వారా వేగంగా వెళ్తున్నాశివారు ప్రాంతాలకు ఆ సౌకర్యం లేకపోయింది. ప్రధానంగా మేడ్చల్ ప్రాంతానికి వెళ్లాలంటే ఇప్పటివరకు బస్సు సౌకర్యం తప్ప మిగతా ఎలాంటి సౌకర్యం లేదు.

ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్లాలంటే ట్రాఫిక్‌లో చుక్కలు కనిపించేవి. ఈ కష్టాలను రూపుమాపేందుకు అధికారులు రెండోదశ ఎంఎంటీఎస్ సర్వీస్‌ను మేడ్చల్ వరకు పొడిగించాలని నిర్ణయించి ఆ దిశగా పనులు మొదలుపెట్టారు. ఈ పనులను 2014లోనే మొదలుపెట్టగా అది ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది.

అయితే త్వరలోనే కూతపెట్టేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణపై బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెడుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్నట్లు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 8న తెలంగాణ హైదరాబాద్‌కి రానుండటం చర్చనీయాంశం అయ్యింది. ఈ పర్యటనలో ప్రధాని ప్రధానంగా రైల్వే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు.

ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ రెండో దశలో భాగంగా మేడ్చల్‌- సికింద్రాబాద్‌- ఉందానగర్‌, మేడ్చల్‌- సికింద్రాబాద్‌ తెల్లాపూర్‌ మార్గంలో ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు.

అయితే నగరంలోని ఏ మూల నుంచైనా మేడ్చల్‌‌కు వెళ్లడం సులువు కానుంది. ఎంఎంటీఎస్‌ ఎక్కితే కేవలం 10 నుంచి 15 రూపాయలతోనే 40 నుంచి 55 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. మేడ్చల్‌- ఉందానగర్‌ మధ్య దూరం 55 కిలోమీటర్లు కాగా ప్రయాణికులు గరిష్ఠంగా 15 రూపాయలతోనే ప్రయాణం చేయవచ్చు.

అలాగే మేడ్చల్‌ నుంచి లింగంపల్లికి 52 కిలోమీటర్లు కాగా ప్రయాణానికి రెండు నుంచి మూడు గంటలు పట్టేది. కాగా అందుబాటులోకి వస్తున్న రెండోదశ వల్ల కేవలం గంటలోనే గమ్యస్థానాలను చేరుకునే అవకాశముంది. మేడ్చల్‌- తెల్లాపూర్‌తో పాటు మేడ్చల్‌- ఉందానగర్‌ మధ్య సికింద్రాబాద్‌ మీదుగా ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు.

అందులో భాగంగా 8న సికింద్రాబాద్-తిరుపతి మధ్య పరులుగు పెట్టనున్న వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. ఈ వందే భారత్ ఆయా స్టేషన్లలో ఎక్కువసేపు ఆగదు కదా అందువల్ల ఇది 8.30 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.

ఇది నల్గొండ, ఒంగోలు, స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. 8న మాత్రం నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండో వందే భారత్ కావడం వల్ల దీని కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

ఇక తన పర్యటనలో ప్రధాని మోదీ MMTS రెండో దశను ప్రారంభిస్తారు. మొత్తం 95 కిలోమీటర్లకు సంబంధించిన ఈ దశ కోసం రైల్వేశాఖ రూ.816 కోట్లు అంచనా వ్యయంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్-మేడ్చల్ రూట్‌లో లాలాగూడ గేట్, మల్కాజ్‌గిరి, దయానందనగర్, సఫిల్ గూడ, ఆర్‌కే పురం, అమ్ముగూడ, కావర్లీ బ్యారెక్స్, అల్వాల్, బొల్లారం బజార్, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి స్టేషన్లు వస్తాయి.

అయితే సీఎం కేసీఆర్ వస్తారా? ప్రధాని పర్యటనలో రాజకీయ అంశాలు లేనప్పటికీ ఇది రాజకీయంగా చర్చకు దారితీసింది. ప్రధాని మోదీ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ఆయన్ని ఆహ్వానించేందుకు ఎయిర్‌పోర్టుకు వస్తారా రారా అనేది హాట్ టాపిక్ అయ్యింది.

ఇదివరకు రెండుసార్లు మోదీ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ రాలేదు. అందుకు ప్రత్యేక కారణాలు చెప్పారు. మరి ఈసారైనా వస్తారా అంటే డౌటే తెలంగాణ , సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.

అయితే టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్‌గా మారాక బీజేపీని ప్రధాని ప్రత్యర్థిగా చూస్తూ ప్రధాని మోదీపై డైరెక్టుగానే విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అటు బీజేపీ నేతలు కూడా కౌంటర్లతో రాజకీయ వేడిని రగిలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తే అది ప్రజల్లోకి నెగెటివ్ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అందువల్ల సీఎం కేసీఆర్ ఈ పర్యటనకు దూరంగా ఉంటారనే ప్రచారం జరుగుతోంది

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh