బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రంగమార్తాండ

Rangamarthanda Collections: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రంగమార్తాండ

టాలీవుడ్‌లో ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న ‘కృష్ణ వంశీ’ నుంచి వచ్చిన తాజా సినిమా రంగమార్తండ.  అయితే కరోనాకు ముందుకు ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో ఒడిదుడుకులతో చివరకు షూటింగ్ కంప్లీటై ఉగాది కానుకగా విడుదల అయ్యింది ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే

మరాఠీలో నానా పాటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ మూవీకి తెలుగు రీమేక్ ‘రంగమార్తాండ’. మరి మరాఠీ ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాకు తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో రంగస్థల నటుడిగా ప్రకాష్ రాజ్ నటనతో పాటు బ్రహ్మానందం  యాక్టింగ్‌కు ఫిదా కానీ వారు ఎవరు ఉండరు. ఎపుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే బ్రహ్మానందం ఈ సినిమాలో ఏడిపించేసాడు. ఇందులో బ్రహ్మాలోని కొత్త నటుడిని చూసి కామన్ ఆడియన్స్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు ఫిదా అయిన చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  బ్రహ్మిని ప్రత్యేకంగా సత్కరించారు. అంతేకాదు ఇప్పటి వరకు ఎవరు చూడని బ్రహ్మానందంను ఈ సినిమాలో చూసినట్టు చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరు సహా పలువురు ప్రముఖులు ఈ సినిమాను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇక బ్రహ్మానందం విషయానికొస్తే తెరపై ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకులకు ఆటోమేటిక్‌గా కితకితలు వచ్చేస్తాయి. అలాంటి బ్రహ్మారంగమార్తాండలో కామెడీతో సీరియస్ పాత్రను ఎంతో హుందాగా నటించి మెప్పించారు. తన కెరీర్ లో తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ మూవీలో ఒక సీరియస్ రోల్‌లో కనిపించారు బ్రహ్మానందంగారు .

అయితే  థియేటర్లో బ్రహ్మానందం సీన్లకు ప్రతీ ఒక్క ఆడియెన్ కంటతడి పెట్టేసుకుంటారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో పాటు శివాత్మిక రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ తదితరులు నటించారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ రేటుకే అమ్మారు. రూ. 2.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 2.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రూ. 1.54 కోట్ల రేంజ్‌లో షేర్‌ను అందుకుంటే హిట్‌గా నిలిచే అవకాశాలున్నాయి. రంగమార్తాండ ఈరోజు, ఆది వారం కలెక్షన్స్ రాబట్టడంపై ఈ సినిమా భవివత్యం ఆధారపడి ఉంది. ఇప్పటికే మౌత్ టాక్‌ బాగుంది. మరోవైపు ఈ సినిమా కమర్షియల్ అంశాలకు పూర్తిగా దూరంగా ఉండటంతో ఈ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ బడ్డలుకొడుతుందో  వేచి చూడాలి మరి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh