జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

జమ్మూ కశ్మీర్‌లోని కిష్ట్వార్‌ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న క్రూజర్‌ వాహనం అదుపు తప్పి లోయలో బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఈ రోజు (బుధవారం) ఉదయం 8.30 గంటల జరిగిందని తెలిపారు.

అలాగే  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డంగుదురు పవర్‌ ప్రాజెక్ట్‌కు చెందిన 10 మంది కార్మికులు క్రూజర్‌ వాహనంలో వెళ్తున్నారు. డంగుదురు డ్యామ్‌ సైట్‌ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కిష్త్వార్‌లో లోతైన లోయలోకి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయడినట్లు కిష్త్వార్‌ పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. డంగుదురు డ్యామ్ సైట్ వద్ద జరిగిన దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుందన్నారు. కిష్త్వార్ డాక్టర్ దేవాన్ష్ యాదవ్‌తో ఇప్పుడే మాట్లాడానని చెప్పారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. కార్మికుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీపంలోని కేరి సెక్టార్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఏప్రిల్ లో జమ్ముకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో బ్రిగేడ్ కు చెందిన అంబులెన్స్ అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
వాస్తవాధీన రేఖకు సమీపంలోని కేరీ సెక్టార్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో టూరిస్ట్ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 25 మందికి గాయాలు అయ్యాయి. బస్సులోని ప్రయాణికులందరూ మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మహిళలు, పిల్లలు సహా దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh