కొండగట్టు ఆంజనీయ స్వామి ఆలయంలో బలగం దర్శకుడు వేణు ప్రత్యేక పూజలు

Balagam: కొండగట్టు ఆంజనీయ స్వామి ఆలయంలో బలగం దర్శకుడు వేణు ప్రత్యేక పూజలు

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘బలగం’. ఈ మూవీ మార్చి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది.

కమెడియన్‌ వేణు దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. చిన్న సినిమాగా విడుదలైన ‘బలగం’ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. జబర్ధస్త్ నటుడు వేణు టిల్లు డైరెక్షన్‌ దర్శకత్వంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించిన సినిమా ‘బలగం’. దిల్ రాజు సమర్ఫణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ప్రొడ్యూస్ చేసారు.

అయితే మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన హిట్ సొంతం చేసుకుంది. మల్లేశం తర్వాత హీరోగా ప్రియదర్శికి ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రియదర్శిలో మంచి కమెడియన్‌ కాకుండా. మంచి నటుడు ఉన్న విషయం మల్లేశం మూవీతోనే ఇది వరకు ప్రూవ్ చేసుకున్నాడు.

ఈ సినిమాలో మధ్య తరగతి తెలంగాణ యువకుడి పాత్రలో తన పరధి మేరకు రాణించాడు. ప్రియదర్శి తాత పాత్రలో నటించిన సుధాకర్ రెడ్డి తన  పాత్రలో జీవించాడు. కావ్యా కళ్యాణ్ రామ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలోని మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

అయితే ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నేటితో మూడు వారాలు పూర్తి చేసుకుటోంది. తాజాగా  ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగు కొత్త సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సరం పురస్కరించుకొని  తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో ‘బలగం’ చిత్ర యూనిట్ ను ఉగాది నంది సత్కారం తో సత్కరించారు. బలగం చిత్ర నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హర్షిత, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ మరియు ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆర్ నారాయణ మూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు నంది పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

అలాగే ఒకవైపు ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ఫ్రైమ్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్స్‌లోనూ మంచి కలెక్షన్స్‌ని రాబడుతోంది.

ఇక తన తొలి చిత్రం సూపర్‌ హిట్‌ కొట్టడంతో వేణు యెల్డండి ఫుల్‌ ఖుషీగా ఉన్నాడు. ఇన్నాళ్లు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న వేణు..తాజాగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాడు. ఫ్యామిలీతో కొండగట్టు వెళ్లిన వేణు.అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో బలగం సినిమా మొదలు పెట్టాను. అంజన్న దయతో బలగం మీ అందరిని మెప్పించింది. అంజన్న దర్శనం అద్భుతంగా జరిగింది’అని వేణు రాసుకొచ్చాడు.

Leave a Reply