ఓ స్టార్ హీరో హిందీ సినిమాలో తెలుగు పాట

 Bath Kamma song boll wood: ఓ స్టార్ హీరో హిందీ సినిమాలో తెలుగు పాట

తెలంగాణ బతుకమ్మ క్రేజ్ దేశవ్యాప్తంగా వెళ్లనుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘కిసి కా బాయ్ కిసి కా జాన్’ నుంచి తాజాగా బతుకమ్మ సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం సాంగ్ కు విశేష ఆదరణ దక్కుతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో నటిస్తున్నారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

పూల పండుగ బతుకమ్మ గురించి తెలంగాణలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పాటలను ఇక్కడి ప్రజలకు ఎంతలా ఇష్టపడుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొమ్మిదిరోజులు జరిగే బతుకమ్మ ఫెస్టివల్ లో అంతటా బతుకమ్మ పాటలే వినిపిస్తుంటాయి. ప్రస్తుతం సినిమాల ద్వారా తెలంగాణ సంస్కృతికి, పాటలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కుతోంది. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచమే మనవైపు తిరిగి చూసింది. ఈక్రమంలో తొలిసారిగా హిందీ సినిమాలో అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రంలో బతుకమ్మ పాటను పెట్టడం ఆసక్తికరంగా మారింది.  కొద్దిసేపటి కింద బతుకమ్మ సాంగ్ విడుదలై ప్రేక్షకాదరణ పొదుతోంది.

పూజా హెగ్డే, విక్టరీ వెంకటేష్, భూమిక చావ్లా, సల్మాన్ ఖాన్ తదితరులు నటించిన బతుకమ్మ ట్రాక్ ను ఈ రోజు విడుదల చేశారు మేకర్స్.  ఈ క్రమంలో చిత్రం నుంచి నాలుగో సాంగ్ ను ‘బతుకమ్మ’ పాటగా విడుదల చేశారు. అలాగే కొంత వీడియో భాగాన్ని కూడా విడుదల చేశారు. విక్టరీ వెంకటేశ్, పూజా హెగ్దే, సల్మాన్ ఖాన్ పూలపండుగ బతుకమ్మలను ఎత్తుకొని వస్తుండటం, బతుకమ్మపాటకు చిందులేయడం ఆఖట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరోవైపు ఓ హిందీ సినిమాలో ఓ తెలుగు పాటను చూడటం తెలుగువారికి ఆశ్చర్యం కలిగించే విషయమే. తమిళంలో సూపర్ హిట్ అయిన వీరమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ కామెడీ మూవీలో జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిమేష్ రేషమియా, రవి బస్రూర్, సుఖ్బీర్ సింగ్, దేవిశ్రీ ప్రసాద్, సాజిద్ ఖాన్, పాయల్ దేవ్, అమాల్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. 2023 ఏప్రిల్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సాంగ్ విడుదలపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. తెలంగాణ బతుకమ్మ సాంగ్ ను సల్మాన్ ఖాన్ సినిమా ద్వారా నార్త్ ఆడియెన్స్ కు వినిపించడం విశేషంగా మారింది.  బతుకమ్మకు పాన్ ఇండియా క్రేజ్ దక్కుతుదంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply