బాల కృష్ణ పై పవన్ కళ్యాణ్ ఫైర్ ….

ndhra-pradesh-unstoppable-balayya

బాల కృష్ణ పై పవన్ కళ్యాణ్ ఫైర్ ….

అన్‌స్టాప్‌బుల్‌ విత్‌ ఎన్‌బీకే కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బాలయ్య సూటి ప్రశ్న వేశారు. బాలకృష్ణ ‘ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పలు పథకాలు తీసుకొచ్చారు. దాదాపు మీ భావాలు కూడా అలాగే ఉన్నాయి. అలాంటప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరలేదు’ అని   పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. బాలయ్య వేసిన ఈ ప్రశ్నతో పవన్ కళ్యాణ్ గారు  ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అక్కడున్న అభిమానులు కూడా షాక్ గురియ్యారు.

బాలయ్య వేసిన ఆ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే ఆన్సర్ చెప్పారు. ‘నేను కాంగ్రెస్‌లోనూ చేరలేదు. ఎందుకంటే అప్పటికే ఉన్న పార్టీలకు సిద్ధాంతాలు, లక్ష్యాలు ఉన్నాయి. అధికారం రాని చాలా సమూహాలకు సాధికారతనిచ్చే దిశగా వెళ్లాలంటే.. అప్పటికే ఉన్న పార్టీలతో ఎంతవరకు సాధించగలనన్న సందేహం వచ్చింది. అందుకే కొన్ని మూల సిద్ధాంతాలు పెట్టుకున్నా. నాకు అధికారమున్నా, లేకున్నా ప్రజల్లో చైతన్యం వచ్చే దిశగా అడుగులు వేయాలంటే. నేనే కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నా’ అని పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు.

మరి గుంటూరు జిల్లా ఇప్పటం, విశాఖపట్నంలో జరిగిన ఘటనల గురించి కూడా బాలకృష్ణ ప్రస్తావించారు. పవన్ కారు టాప్‌పై కూర్చున్న ఫొటోను ప్రదర్శించారు. ఆ ఘటనలకు కారణం ఏంటని ప్రశ్నించారు. ‘జనసేన సభకు స్థలం ఇచ్చారన్న కారణంగానే ఇప్పటం గ్రామ రైతుల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయించింది. అప్పటికే వారికి ఇచ్చిన నోటీసులను అవకాశంగా వాడుకుంది. నేను వారిని పలకరించడానికి ఇప్పటం వెళ్దామనుకున్నా. పోలీసులు ఎటు  కదలనివ్వలేదు. విశాఖలోనూ ఇబ్బంది పెట్టడమే కాకుండా కనీసం  చేతులు కూడా     ఉపకూడదన్నారు. లైట్లు తీసేశారు,ఇంకా  హోటల్‌ గదిలో నిర్బంధించారు. బయటకు రాకూడదన్నారు. ఓ పార్టీ అధినేతగా బాధితులను పరామర్శించేందుకు ఇప్పటం వెళ్తే.. అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. మొదటిసారి నాకు తిక్క వచ్చింది’ అని పవన్ కళ్యాణ్ వివరించారు.   ‘ ప్రజాస్వామ్యం అంటేనే నోరు ఎత్తడం. నా సినిమా వంద మందిలో 40 మందికి నచ్చకపోవచ్చు. అప్పుడు వారు తిడతారు, నచ్చని గొంతు అయినా వినాలి. అసలు నోరెత్తకూడదంటే ఎలా? నేను నోరెత్తితే ప్రజలకు చేరుతుందనే ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇదో నిరంకుశ విధానం. రాజకీయ ప్రయాణంలో ఇదో భాగం మాత్రమే. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులను వాడుకునే శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఎవరు కాలరాసినా ఎదుర్కొనే శక్తి ఉండాలి. పాము తన సహజ లక్షణాన్ని కోల్పోతే. దాని పడగపైనా కొడుతుంటారు. మన మంచితనం ప్రత్యర్థికి బలహీనతగా కనిపిస్తే. అలాగే చేస్తారు’ అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

ఇది కూడా  చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh