Modi : భారత ప్రధానమంత్రి మోదీగారికి అరుదైన సత్కారం
Modi : అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతున్న వేళ ప్రధాని మోదీకి వివిధ దేశాలు అరుదైన గౌరవాన్ని ఇస్తున్నాయి.
ఇండియా – పసిఫిక్ ఐలాండ్స్ కో ఆపరేషన్ మూడో సదస్సులో భాగంగా పపువా న్యూ గినియా దేశంలో పర్యటిస్తున్న ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది ఫిజీ ప్రభుత్వం.
అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ నేతగా.. ప్రధాని మోదీ చూపిస్తున్న చొరవకు గుర్తింపుగా..
“ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి” సత్కారంతో గౌరవించింది ఆ దేశ ప్రభుత్వం.
అసలు ఫిజీ దేశస్థులు కానివారికి ఈ అవార్డు ఇవ్వడం అరుదు.
ప్రధాని మోదీ ఈ మెడల్‌ను ఫిజీ ప్రధాని సితివెనిModi : రాబుకా నుంచి అందుకున్నారు.
అవార్డును అందించినందుకు గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడేకు ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇది భారతదేశానికి, భారత ప్రజల విజయాలకు గొప్ప గుర్తింపు అని పేర్కొన్నారు.
ఫిజియేతరులు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు” అని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోది ఈ గౌరవాన్ని భారత దేశ ప్రజలకు అంకితం చేశారు.
అలాగే.. ఫిజీలో ఉంటున్న భారత కమ్యూనిటీ వారికి అంకితం చేశారు.
ఫిజీలోని భారత కమ్యూనిటీ వారు.
. రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడేందుకు కీలక పాత్ర పోషించారని అన్నట్లుగా ట్విట్టర్‌లో భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది.
ఫిజీలో జరిగిన ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోపరేషన్ (FIPIC)లో పాల్గొన్న సందర్భంగా.. ప్రధాని మోదీ.
. ఫిజీ ప్రధాని రాబుకాని కలిశారు. ఫిజీ ప్రధానిని కలవడం Modi : ఆనందదాయకం. మేము రకరకాల అంశాలపై మాట్లాడుకున్నాం.
భారత్, ఫిజీ మధ్య సంబంధాలు కాలపరీక్షను తట్టుకొని నిలబడ్డాయి.
రానున్న సంవత్సరాల్లో ఈ సంబంధాలను మరింత పటిష్టం చేసే దిశగా కృషి చేస్తాం అని.. అని ప్రధాని మోదీ.. ట్వీట్ చేశారు.
అయితే ప్రధాని మోదీకి చాలా దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు వచ్చాయి.
ఈ గుర్తింపు భారత ప్రధాని నాయకత్వం, ఆయన విజన్‌ను తెలియజేయడమే కాదు.
ప్రపంచ దేశాల్లో భారత్ మరింత బలపడేందుకు కూడా ఉపయోగపడుతుంది.
ప్రపంచ దేశాలతో భారత దేశ సంబంధాలు బలపడుతున్నాయి అని కూడా ఈ అవార్డులు నిరూపిస్తున్నాయి.
Humbled by the gesture of Papua New Guinea of conferring me with the Companion of the Order of Logohu. Gratitude to Governor General Sir Bob Dadae for presenting the award. This is a great recognition of India and the accomplishments of our people. pic.twitter.com/VDhqTJK6Ra
— Narendra Modi (@narendramodi) May 22, 2023