ప్రధాని మోదీ మౌన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ పై కాంగ్రెస్ ‘సెటైర్లు
Mann Ki Baat: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియా ప్రోగ్రాం “మన్ కీ బాత్” 100వ ఎపిసోడ్ ఈనెల 30న నభూతో నభవిష్యతి అన్న రీతిలో ప్రసారం చేసేందుకు బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తుండగా, ఈ ప్రోగ్రాంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ సెటైర్లు వేశారు. అదానీ, చైనా, ఇతర అంశాలపై ”Mann Ki Baat” నడుస్తోందని అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. పీఎం శక్తివంతమైన పీఆర్ యంత్రాంగం ‘మన్ కీ బాత్’ 100 ఎపిసోడ్ అంటూ ఊదరగొడుతోంది. మరోవైపు అదానీ, చైనా, సత్యపాల్ మాలిక్ వెల్లడించిన అంశాలు, ఎంఎస్ఎంఈల విధ్వంసం, ఇతర కీలక అంశాలపై ‘మౌన్ కీ బాత్’ నడుస్తోంది” అని జైరామ్ రమేష్ ఆ ట్వీట్లో విమర్శించారు
వచ్చే ఆదివారంతో ‘Mann Ki Baat’ కార్యక్రమం 100వ ఎడిషన్ ను పూర్తి చేసుకోనుందని, ప్రజల మద్దతుే తన నెలవారీ రేడియో ప్రసంగాన్ని విజయవంతం చేయడానికి కారణమైందని ప్రధాని పేర్కొన్నారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్-రోహ్ తక్ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి నెలా చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి దాదాపు 23 కోట్ల మంది హాజరవుతారని, 65 శాతం మంది శ్రోతలు హిందీలో ప్రసంగాన్ని వినడానికి ఇష్టపడుతున్నారని తెలిపింది.
ఐఐఎం-రోహ్ తక్ విద్యార్థులు నిర్వహించిన ఈ సర్వేలో 73 శాతం మంది ప్రభుత్వ పనితీరు, దేశ పురోగతిపై ఆశాభావం వ్యక్తం చేయగా, 58 శాతం మంది తమ జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. 59 శాతం మంది ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని చెప్పారు.
ప్రభుత్వం పట్ల తమ వైఖరి సానుకూలంగా మారిందని 63 శాతం మంది, దేశ నిర్మాణం కోసం పనిచేయడానికి 60 శాతం మంది ఆసక్తి కనబరిచారంటే ప్రభుత్వం పట్ల సాధారణ సెంటిమెంట్ ను అర్థం చేసుకోవచ్చు.
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని చేపట్టిన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం ఇప్పటి వరకూ 99 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ బడావో, వాటర్ కన్జర్వేషన్, ఆయుష్, ఖాదీ తదితర అంశాలు ఆయా ఎపిసోడ్లో ప్రస్తావించడం, అంతగా గుర్తింపునకు నోచుకోని వ్యక్తులను వెలుగులోకి తేవడం సహా అనేక అంశాలతో ఈ రేడియో ప్రోగ్రాం జనబాహుళ్యానికి దగ్గరైంది. 2014 అక్టోబర్ 3న ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి నెలా చివరి ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియా, డీడీ నెట్‌వర్క్‌లో ‘మన్ కీ బాత్’ ప్రసారం అవుతోంది.100వ ఎపిసోడ్‌ను దేశవ్యాప్తంగానే కాకుండా వివిధ దేశాల్లో లైవ్ ప్రసారం చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది.
"Maun ki Baat on Adani, China issue…" Jairam Ramesh on PM Modi's upcoming 100th episode of 'Mann Ki Baat'
Read @ANI Story | https://t.co/jpFkrfZ2pm#JairamRamesh #PMModi #MannkiBaat pic.twitter.com/Oyt93C6U6t
— ANI Digital (@ani_digital) April 25, 2023