Matrusri Nagar: మాతృ శ్రీ నగర్ కాలనీ 5k రన్ :
Matrusri Nagar : మాదాపూర్ డివిజన్ లోని మాతృశ్రీనగర్ కాలనీ లో వెల్ ఫేర్ అసోసియేషన్ ఆద్వర్యం లో నిర్వహించిన 5k రన్ కార్యక్రమానికి BRS పార్టీ MLA శ్రీ ఆరేకపూడి గాంధీ గారు ముఖ్య అతిధి గా విచ్చేశారు , వీరితో పాటు కార్పొరేటర్లు జగధీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తది తరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు.
ఈ సందర్బంగా MLA గారు మాట్లాడుతూ.. మాతృ శ్రీ నగర్ రెసిడెంట్స్ వేల్ఫేర్ అసోసియేషన్ ఆద్వర్యం లో 5K రన్ నిర్వహించడం అభినందనీయమని , ఇప్పటి ఉరుకులు పరుగులు జీవితం లో శారీరిక శ్రమ ఎంతో అవసరం అని ఆయన పేర్కొన్నారు.
ఈ మారఠాన్ లో వయసు తో పనిలేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎంతో మంది పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అందరూ ఆరోగ్యం విశయం లో జాగ్రతలు తీసుకోవాలని శారీరక శ్రమ వలన మానసికొల్లాసం, మనసు ప్రశాంతం గా వుంటుందని, కాలం తో పాటు జీవన శైలి కూడా మారుతూ వస్తుంది ఆరోగ్యం గా వుండాలి అంటే వ్యాయామం చేయాలని పేర్కొన్నారు.
అంతే కాకుండా ఇలాంటి రన్ ఎంతో మందికి స్పూర్తిదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమం లో మాతృ శ్రీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ కావూరి అనిల్ కుమార్, సెక్రెటరీ నాగరాజు, కన్నయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.