Bhavaneswari and Nara Lokesh: 100వ రోజు లోకేశ్ పాదయాత్ర లో తల్లి నారా భువనేశ్వరి
Bhavaneswari and Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ చేపట్టిన పాదయాత్ర సోమవారం (నేటి )తో వందో రోజుకు చేరుకుంది.
ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర నంద్యాల జిల్లా శ్రీశైలంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు లోకేష్ 1,200 కి.మీ మేర పాదయాత్ర పూర్తిచేశారు. అయితే తాను పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్బంగా మోతుకూరులో పైలాన్ ఆవిష్కరించారు.
Also Watch
మరోవైపు ఈరోజు లోకేష్ పాదయాత్రలో ఆయన తల్లి నారా భువనేశ్వరితో పాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి మణి, సీహెచ్ శ్రీమాన్, సీహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్ తదితరులు పాదయాత్రలో పాల్గొని లోకేశ్ వెంట ముందుకు సాగారు.ఈ సందర్భంగా టీడీపీ నేతలు 100 మొక్కలు నాటారు.
లోకేశ్ వెంట భువనేశ్వరి నడుస్తున్న క్రమంలో ఆమె షూ లేస్ ఊడటాన్ని గమనించిన లోకేశ్ తన చేతులతో తల్లి షూ లేస్‌లు కట్టారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా గుమ్మికూడారు. పాదయాత్ర సందర్భంగా బోయరేవుల క్యాంప్ సైట్, మోతుకూరు పరిసరాల్లో మూడు కిలో మీటర్లుమేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
మరోవైపు తన పాదయాత్ర 100వ రోజుకు చేరుకున్న సందర్భంగా లోకేష్ ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. ‘‘అడ్డంకుల్ని లెక్క చేయలేదు. ఎండలకి ఆగిపోలేదు. వాన పడితే చెదిరిపోలేదు. ప్రజల కోసం నేను నా కోసం ప్రజలు యువగళం పాదయాత్రని ముందుండి నడిపిస్తున్నారు. యువగళం పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు, యువగళం వలంటీర్లు, కమిటీలు, తెలుగుదేశం కుటుంబసభ్యులు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. పాదయాత్ర ప్రజల యాత్ర అయింది. యువగళం జనగళమైంది. యువగళం పాదయాత్రని విధ్వంసక, ఆటవిక సర్కారుపై ప్రజాదండయాత్రని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని లోకేష్ పేర్కొన్నారు. ఇక, నారా లోకేష్ పాదయాత్ర జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.
అడ్డంకుల్ని లెక్క చేయలేదు. ఎండలకి ఆగిపోలేదు. వాన పడితే చెదిరిపోలేదు. ప్రజల కోసం నేను..నా కోసం ప్రజలు యువగళం పాదయాత్రని ముందుండి నడిపిస్తున్నారు.(1/3)#100DaysofYuvagalam pic.twitter.com/aCTASuC0PP
— Lokesh Nara (@naralokesh) May 15, 2023