పోటా పోటీ గా తెలంగాణ పొలిటికల్ పార్టీస్ !

congress

పోటా పోటీ గా తెలంగాణ పొలిటికల్ పార్టీస్….

 

పోటా పోటీ గా తెలంగాణ పొలిటికల్ పార్టీస్ . తెలంగాణలో టఫ్ ఫైట్ నడుస్తోంది. పరస్పర ఆరోపణలు, వాగ్దానాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మళ్లీ సత్తా చాటాలని కాంగ్రెస్.. ఈసారి గెలిచి చూపిస్తామని బీఆర్ఎస్.. 10 సీట్లు పక్కా అంటూ బీజేపీ..ఇలా ఎవరికి వారు గెలుపుపై ధీమా ఉన్నారు.గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ కానుంది. ప్రచార ఘట్టం తారస్థాయికి చేరుకుంది. కమలం పార్టీ కొత్త వ్యూహాన్ని రచిస్తే.. కారు పార్టీ స్పీడ్ పెంచింది. మళ్లీ అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగరేసిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. 14 ఎంపీ సీట్లను కైవసం చేసుకుని బీఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తామంటూ సవాల్ విసురుతోంది. ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. శుక్రవారం నుంచి సీఎం రేవంత్ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 50 సభలు, 15 రోడ్ షో లు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలోనూ సీఎం రేవంత్ పాల్గొననున్నారు.

మరోవైపు బీజేపీ కొత్త వ్యూహం రచించింది. ప్రతి అభ్యర్థి నామినేషన్ ను భారీ ఈవెంట్ లా ప్లాన్ చేస్తోంది. ఒక్కో అభ్యర్థి నామినేషన్ కు ఒక్కో జాతీయ నేత వచ్చేలా షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. నామినేషన్ల కార్యక్రమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలకు తెలంగాణ బీజేపీ ఆహ్వానం పంపింది.

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. గురువారం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు. ప్రతిపక్ష పార్టీగా అవతరించిన తర్వాత తొలిసారి కేసీఆర్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా నేతలను పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించిన గులాబీ బాస్.. బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై పార్టీ నేతలతో చర్చించనున్నారు

ఇక తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ప్రజలకు వాగ్దానాలతో పాటు ఇతర పార్టీల విమర్శనాస్త్రాలు సంధించేందుకు ఎవరికి వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఎవరికి జై కొడతారో చూడాలి.

కమలం పార్టీ కొత్త వ్యూహాన్ని రచిస్తే.. కారు పార్టీ స్పీడ్ పెంచింది. మళ్లీ అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.

 

Lok Sabha Elections Scheduled on 13th May in Telangana and Andhra Pradesh |  IND Today - YouTube

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh