KTR : ఢిల్లీలో కేటీఆర్.. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌తో భేటీ
KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమవుతున్నారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీలు శనివారం కలిశారు. రాత్రి 10:15కి అమిత్‌షాను కేటీఆర్ కలవనున్నారు.
కీలక ప్రాజెక్ట్‌లపై కేంద్ర సాయం కోరడమే లక్ష్యంగా వరుసగా కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు.
తాజాగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన శానిటేషన్ హబ్ కార్యక్రమంపైన హర్దీప్ సింగ్ పూరి ప్రశంసలు కురిపించారు.
ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో కూడిన శానిటేషన్ హబ్‌తో పురపాలక అభివృద్ధిలో అనేక సవాళ్లకు సమాధానం దొరుకుతుందన్నారు.
ఈ అంశంపైన తెలంగాణ రాష్ట్రం తన నమూనాను, ఆలోచనలను పంచుకోవాలని హర్దీప్ సింగ్ పూరీ కోరారు.
త్వరలోనే తన మంత్రిత్వ శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసే సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు.
అలాగే హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్లాన్‌కు ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రిని కోరారు.
ఎస్టీపీల నిర్మాణాలకు 8,654 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతు ఖర్చును అమృత్-2 కింద ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం ప్రాజెక్టు విషయంలో సాయం అందించాలని కోరారు మంత్రి.
హైదరాబాద్‌లో 10 కిలోమీటర్ల మేర పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ నుంచి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు.
పీఆర్టీ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం 2,850 కోట్ల రూపాయల కేంద్ర సాయం కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ ప్రాజెక్టు పూర్తయితే మురుగునీటిని శుద్ధి చేయడమే కాకుండా మూసీ నదితో పాటు, ఇతర నీటి వనరులకు మురుగు కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఉందనేది ప్రభుత్వ అభిప్రాయం పడుతుంది.