TTD: తిరుమల దర్శనంకు తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలు ఆమోదించండి.. చంద్రబాబుకు సురేఖ లేఖ..!

తిరుమల శ్రీనివాసుడి దర్శనాల పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల దర్శనాల్లో తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలకు అవకాశం కల్పించారు. అయితే, ఆ నిర్ణయం సరిగ్గా అమలవటం లేదని ఇప్పటికే పలువురు నేతలు వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఇదే అంశం పైన కొండా సురేఖ ఏపీ సీఎంకు రాసిన లేఖలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అధికారికంగా జీవో ఇచ్చి సరిదిద్దాలని అభ్యర్ధించారు.

టీటీడీ ద‌ర్శ‌నాలపై ఏపీ సీఎం కి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖ రాసారు. టీటీడీ అధికారులు తెలంగాణ భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డంపై తీవ్ర గందర గోళం నెల‌కొందని ఏపీ సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసికెళ్లారు. టీటీడీ అధికారులు ఏపీ సీఎం ఆ దేశాలను సరిగ్గా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖల వ్యవస్థను తిరిగి తీసుకువచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూనే.. ఈ నిర్ణయం సరిగ్గా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

తెలంగాణ నుండి తిరుమలను సందర్శించే భక్తుల సంఖ్య ఈ మ‌ధ్య బాగా పెరిగిందని మంత్రి వివరించారు. ముఖ్యంగా తెలంగాణ ప్ర‌జ‌ల భ‌క్తి తో తిరుమల కు శ్రీవారి దర్శనం కోసం వస్తున్న వారి సంఖ్య తగ్గలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇస్తున్న లేఖలకు ప్రాధాన్యత ఇవ్వని కారణంగా తమ రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి, సదరు ఆదేశాలను సక్రమంగా పాటించేలా టిటిడి అధికారులకు స్పష్టమైన సూచన ఇవ్వాలని ప్ర‌త్యేకంగా విజ్ఞ‌ప్తి చేసారు. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి సత్వరమే చర్యలు తీసుకో లని లేఖలో కోరారు.

సీఎం కు లేఖతో తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన లేఖ ఆధారంగా ఇప్పటికే ఏపీ సీఎంఓ టీటీడీకి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలకు ప్రాధాన్యత ఇవ్వాలని కొండా సురేఖ సూచించారు. తిరుమల శ్రీనివాసుడి దర్శనాల కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి పెరుగుతున్న బ్రేక్ దర్శనాల ఒత్తిడితో సాధారణ భక్తుల ఇబ్బందుల పైన టీటీడీ ఫోకస్ చేసినప్పటికీ.. అందరి లేఖల సిఫార్సులు పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. దీంతో, తెలంగాణ ప్రజా ప్రతినిధుల ఆందోళనతో తాజాగా కొండా సురేఖ నేరుగా ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు. ఈ లేఖ పైన చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారన్నదే చూడాలి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh