Kim Jong Un: తొలిసారి తన కూతురుని ప్రపంచానికి చూపించిన కిమ్….

ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏది చేసిన సంచలనమే. తన మొండి వైఖరి కారణంగా.. ప్రపంచం వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. అగ్రరాజ్యం అమెరికాతోనే ఢీ అంటే ఢీ అంటూ యావత్ ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేశాడు. ఉత్తరకొరియాకు మిత్ర దేశాలకంటే, శత్రువులే ఎక్కువ. అందుకే.. తనకు సంబంధించిన ప్రతీ అంశాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు కిమ్. అయితే ఇటీవల కిమ్ ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తోంది. ఇంత గోప్యంగా ఉండే కిమ్.. ఇప్పుడు తన కుటుంబాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

ఏడు నెలల క్రితం తన భార్యతో కలిసి కనిపించిన కిమ్.. తాజాగా తన కూతురుతో కలిసి తొలిసారిగా పబ్లిక్‌గా కనిపించాడు. ఇలా ఆయన కుమార్తెతో కనిపించడం ప్రపంచవాప్తంగా చర్చనీయాంశమైంది.KCNA కిమ్ తన కుమార్తెతో చేయి చేయి కలిపి నడుస్తున్న ఫోటోలను ప్రచురించింది. నవంబర్ 18న క్షిపణి ప్రయోగాన్ని చూసేందుకు కిమ్ తన కూతురిని వెంట తెచ్చుకున్నాడు. ఉత్తర కొరియా గురువారం పాంగాంగ్ అంతర్జాతీయ ఎయిర్‌ఫీల్డ్ నుండి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ నెలలో ఉత్తర కొరియా ప్రారంభించిన రెండో టెస్టు ఇది. ఈ క్షిపణి 999.2 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్రంపై పడింది. ఒకే దాడిలో మొత్తం అమెరికా ప్రధాన భూభాగాన్ని నాశనం చేయగల సామర్థ్యం తమకు ఉందని ఉత్తర కొరియా అధికారులు చెబుతున్నారు.

ఇదిలాఉంటే.. వాస్తవానికి కిమ్ వ్యక్తిగత జీవితం ఇప్పటికీ రహస్యమే. బాస్కెట్ బాల్ మాజీ స్టార్ డెనిస్ రోడ్మన్ 2013లో బ్రిటిష్ డైలీ ‘గార్డియన్’తో మాట్లాడుతూ.. కిమ్‌కు ఓ కుమార్తె ఉందని, ఆమె పేరు ‘జు ఏ’ అని పేర్కొన్నారు. తాను ఆయన కుటుంబంతో గడిపానని చెప్పుకొచ్చారు. కిమ్‌ను మంచి తండ్రిగా అభివర్ణించిన ఆయన.. కిమ్ భార్య ‘రి సోల్ జు’తోనూ మాట్లాడానన్నారు. కాగా, జులై 2012 వరకు కిమ్-రి వివాహంపై ప్రభుత్వ మీడియా వెల్లడించలేదు. అప్పటికి మూడేళ్ల ముందే వీరి వివాహాన్ని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఆ తరువాత కొంతకాలానికి 2018లో నార్త్ కొరియా అధికారిక మీడియా కిమ్ భార్యకు ‘ప్రథమ మహిళ’గా పట్టం కట్టింది. కాగా, కిమ్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh