Karnataka Results: కర్ణాటక ఫలితాలపై

Karnataka Results: కర్ణాటక ఫలితాలపై మాట్లాడిన శశిథరూర్

Karnataka Results:  దక్షిణాది నుంచి బీజేపీ ఒడిపోవడానికి  కారణమైన కర్ణాటకలో ఘన విజయంపై కాంగ్రెస్ శిబిరాల్లో సంబరాలు జరుగుతుండగా,

పార్టీ తిరువనంతపురం ఎంపీ తన పార్టీ సహచరులకు ఇది అలసత్వానికి సమయం కాదని, పార్టీ ఇప్పుడు ఫలితాలను కర్ణాటక ప్రజలకు అందించాల్సి ఉందని గుర్తు చేశారు.

క్షేత్రస్థాయిలో విశేష కృషి, స్థానిక సమస్యలపై స్పందించడం, పోలరైజేషన్ రాజకీయాలను ప్రతిఘటించడంలో నిబద్ధతతో పనిచేసినందుకు @INCKarnataka సహచరులను చూసి గర్వపడుతున్నానని అన్నారు.

ఇప్పుడు సంబరాలకు సమయం వచ్చింది కానీ తృప్తి కోసం కాదు. మేము పనిచేసిన ఫలితాలు మాకు ఉన్నాయి; ఇప్పుడు మనం కర్ణాటక ప్రజలకు ఫలితాలను అందించాలి” అని ఎంపీ ట్వీట్ చేశారు.

కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో 224 అసెంబ్లీ స్థానాలకు గాను 136 స్థానాల్లో విజయం సాధించి/ ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ.. అధికారానికి కావాల్సిన పూర్తి మెజార్టీ సాధించింది.

మ్యాజిక్ ఫిగర్ 113కు మించి.. అత్యధిక సీట్లలో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థులు. 130 సీట్లలో విజయం ఖాయంగా ఉంది. విక్టరీ వన్ సైడ్ కావటంతో.

. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ కొత్త చర్చ తెరపైకి వచ్చింది.

కర్ణాటక సీఎం ఎవరు అని.. ప్రస్తుతం ఇద్దరు అగ్రనేతలు పోటీలో ఉన్నారు. ఒకరు మాజీ సీఎం సిద్దరామయ్య.

కర్ణాటక ఫలితాలపై మాట్లాడిన శశిథరూర్

. మరొకరు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ తీసుకురావటంలో తీవ్రంగా కృషి చేశారు.

గత ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో.. డీకే శివకుమార్ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. అన్నీ తానై వ్యవహరించారు. పార్టీని నడిపించటంలో..

పార్టీ క్యాడర్ కు ఉత్సాహం నింపటంలో ముందున్నారు. కాంగ్రెస్ నుంచి చేజారిన నేతలను  తిరిగి కాంగ్రెస్ వైపు తీసుకొచ్చారు.

క్యాంప్ రాజకీయాల ఉచ్చులో చిక్కుకున్న వారిని సైతం ఒప్పించి తీసుకొచ్చారు. ఎన్నికల ఖర్చు కూడా ఆయనే భరించాలనే ప్రచారం ఉంది. మనీలాండరింగ్ కేసులు ఎదుర్కొన్నారు.

జైలుకు కూడా వెళ్లి వచ్చారు. డీకే శివకుమార్ జైలులో ఉన్నప్పుడు సోనియాగాంధీ స్వయంగా జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చారు.

రాహుల్ గాంధీ పాదయాత్రను కర్ణాటక రాష్ట్రంలో విజయవంతం చేయటంలో డీకే శివకుమార్ పాత్ర కీలకం.

ఇదే సమయంలో మాజీ సీఎం సిద్దరామయ్యను కూడా విస్మరించలేని విషయం. గతంలో ఆయన ఐదేళ్లు సీఎంగా చేసినప్పుడు చేసిన అభివృద్ధి కలిసొచ్చింది.

మంచి మాటకారి.. వ్యూహ రచన చేయటంలో దిట్ట. బ్రహ్మాణ – వక్కలింగ – లింగాయత్ సామాజిక వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి.. గత ఎన్నికల్లోనే కాదు

.. ఈ ఎన్నికల్లోనూ ఆయన చేసిన ప్రయోగం ఫలించింది.

అయితే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించిన పార్టీ వీరిద్దరి మధ్య ఐక్యతను చాటుకుంది.

కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలోనే హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటక తీర్పుపై తొలిసారి స్పందించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh