ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు పార్టీ కండువా కప్పి కన్నా లక్ష్మీనారాయణను టీడీపీలోకి ఆహ్వానించారు. కన్నా లక్ష్మీనారాయణ కొన్ని రోజుల క్రితం బీజేపీకి రాజీనామాచేసిన విషయం తెలిసిందే. కాగా ఆయన ఏ పార్టీలో చేరతారనే కొన్ని రోజుల నుండి ఆసక్తి నెలకొంది. దానికి ఈ రోజు తెరదించారు కన్నా. ఈ రోజు పెద్ద ఎత్తున అనుచరులతో చంద్రబాబు సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు.
గత కొంతకాలంగా బీజేపీకి దూరంగానే ఉంటువస్తున్నారు కన్నా లక్ష్మీ నారాయణ. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎంపీ జీవీఎల్ తీరుపై వారు అసంతృప్తి తో ఉన్న కన్నా, తన అనుచరులతో మంతనాలు జరిపి బీజేపీ కి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. తర్వాత లక్ష్మీనారాయణతో జనసేన పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌తో కన్నా భేటీ అయ్యారు. దాంతో ఆయన జనసేనలో చెరతరని గుసగుసలు వినిపించాయి. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉందని తాను ఇంకా ఏ పార్టీలోకి చెరతను అని అప్పుడే చెప్పలేనని ఆ సందర్భంలో కన్నా అన్నట్లు కన్నా అనుచరులు తెలిపారు. కానీ కన్నా అనుచరులు మాత్రం టీడీపీలో చేరితేనే రాజకీయంగా లబ్ధి ఉంటుందని వారు నిర్వహించిన సంవేశంలో అందరూ తీర్మానం చేసుకోవడంతో ఈ రోజు ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కాపు నాయకుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం టీడీపీకి కొంచం బలం పెరిగినట్లు బావిస్తున్నారు తెలుగు తముళ్ళు.
ఇది కూడా చదవండి: